ఏపీలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా..కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా , గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
నామినేషన్ల దాఖలుకు ఈ నెల 23 తుదిగడువు, 24న నామినేషన్ల పరిశీలన , నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 తుదిగడువు ఉంటుంది. మార్చి 14న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు, మార్చి 22 లోపు ఎన్నిక ప్రక్రియ పూర్తి అవుతుంది.
ఇదీ చదవండి: