ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నాగుల చవితి - రాష్ట్ర వ్యాప్తంగా నాగుల చవితి న్యూస్

నాగులచవితిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. భక్తులు నాగులపుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు.

nagula chavithi celebrations
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నాగుల చవితి
author img

By

Published : Nov 18, 2020, 10:11 AM IST

కృష్ణా జిల్లాలో..

నాగుల చవితి సందర్భంగా విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఉపాలయమైన శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో సురేష్ బాబు దేవస్థానం తరఫున శాస్త్రోక్తంగా పూజలు చేసి, ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్టలో పాలు పోశారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

తూర్పు గోదావరి జిల్లాలో..

తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో నాగుల చవితిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే అనపర్తి వీర్రాజు మామిడి వద్ద ఉన్న సుబ్రహ్మణ్యశ్వేర స్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

యానాంలో..

కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నాగుల చవితిని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పుట్టల వద్ద భక్తులు పూజలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. పుట్టల వద్ద ఎక్కువ మంది గూమికూడి ఉండకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కొవిడ్ నుంచి తొందరగా బయటపడేలా చూడాలని భక్తులు నాగేంద్రుడిని వేడుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో..

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టల వద్ద సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఉండ్రాజవరంలో ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయం ప్రాంగణంలో ఉన్న పుట్ట వద్ద పూజలు చేసి, మెుక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు.

ప్రకాశం జిల్లాలో..

నాగుల చవితి సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భక్తులు పుట్టల్లో పాలు పోసి మెుక్కులు చెల్లించుకున్నారు. చిన్నారు పుట్టల వద్ద టపాసులు కాల్చుతూ సందడి చేశారు. ఒంగోలు రంగరాయ చెరువు గట్టుమీద ఉన్న నాగంద్రుని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాల్లో సైతం పూజలు చేసి.. నాగేంద్రుడికి నైవేద్యాలు సమర్పించారు.

ఇదీ చదవండి:

తెలంగాణ నుంచి శ్రీశైలానికి పర్యాటక బస్సులు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.