ETV Bharat / city

ఓట్ల కోసం అభ్యర్థుల తంటాలు.. అప్పు చేసి డబ్బుల పంపిణీ..! - పంచాయతీ ఎన్నికలు తాజా వార్తలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ డబ్బులు పంచేందుకు అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారంటా..! అసలే కరోనాతో ఆర్థికంగా చితికిలపడ్డ అభ్యర్థులు.. గెలుపోటములను ప్రభావితం చేసే వార్డుల్లో ఒక్కో అభ్యర్థి అధికంగా డిమాండ్ చేస్తున్నారని భోగట్టా..! మరోవైపు ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో నగదు సేకరణ గురించి అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారని.. వడ్డీకి అప్పు చేసి మరీ పోటీ చేస్తున్నట్టు సమాచారం.

sarpanch candidates facing issues
అప్పు చేసి మరీ డబ్బుల పంపిణీ
author img

By

Published : Feb 4, 2021, 4:41 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో దిగిన అభ్యర్థుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి చందాన మారింది. అసలే కరోనా లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చతికిల పడగా.. తాజాగా ఎన్నికల్లో డబ్బులు పంచడం తలకుమించిన భారమవుతోంది. గత సర్పంచి ఎన్నికల్లో ఓటుకు రూ.300 నుంచి రూ.500లతో సర్దుబాటు చేయగా.. ప్రస్తుతం ఆ మొత్తం రెండు, మూడు రెట్లు పెరిగినట్లు సమాచారం. గెలుపోటములను ప్రభావితం చేసే వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేలు కూడా ఇవ్వాల్సి వస్తోందని కొందరు అభ్యర్థులు తమ అనుచర గణంతో వాపోతున్నట్లు భోగట్టా.

మీ వార్డులో, ప్రాంతంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? అక్కడి ఓటర్లు ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారు? ఒక్కో ఓటుకు ఎంత మొత్తం ఆశిస్తున్నారు? తదితర అంశాలపై జోరుగా చర్చ సాగుతోంది. ఓటుకు రూ.1000 నుంచి రూ.2000 ఇస్తే తప్ఫా. తట్టుకోలేమని ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి సమాధానం వస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన పంచాయతీలో 60 శాతం ఓటర్లకైనా ‘డబ్బు పంపిణీ’ తప్పదని అంచనా వేస్తున్నారు. ముందు విడత రూ.వెయ్యి పంపిణీ చేసి, అవసరాన్ని బట్టి పెంచుదామన్న యోచనలో నాయకులు ఉన్నారు. మరోవైపు సమయం తక్కువగా ఉండటంతో నగదు సేకరణ గురించి అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు అభ్యర్థులైతే ఆరేడు రూపాయల వడ్డీకి కూడా అప్పులు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇదీ చదవండి:

వేలంలో రూ.50.50 లక్షలకు సర్పంచి పదవి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.