ETV Bharat / city

నింగిని తాకిన సంక్రాంతి సంబరాలు..! సంతోషాల ఊయల్లో తెలుగు లోగిళ్లు!!

ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు, వాటిల్లో రతణాల గొబ్బిళ్లు.. ఇంట్లో కొత్త అల్లుళ్ల సందళ్లు, మరదళ్ల కేరింతలు.. వాడ వాడనా ఆటల పోటీల హంగామా..! ఇంతేనా? హరిదాసుల కీర్తనలు.. కోనసీమ ప్రభలు.. ఆలయాల్లో దూప దీపం.. ఊరుబయట కత్తుల కోలాటం.. ఇలా ఊరంతా కళకళలాడిన సందర్భం చూడడానికి రెండు కళ్లూ చాలవంటే.. ఏ మాత్రం అతిశయోక్తి కాదు! తెలుగువారి పెద్ద పండుగ మకర సంక్రాంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. అంబరాన్నంటేలా సంబరాలు చేసుకుంటున్నారు.

నింగిని తాకిన సంక్రాంతి సంబరం..! సంతోషాల ఊయల్లో తెలుగు లోగిళ్లు!!

author img

By

Published : Jan 15, 2022, 7:10 PM IST

Updated : Jan 15, 2022, 7:52 PM IST

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ కళకళలాడుతోంది. పట్నం నుంచి పల్లె వరకు ప్రతి ఇంటి ముంగిటా రంగవల్లులు హరివిల్లులను తలపిస్తున్నాయి. బంధుమిత్రులు, కొత్త కోడళ్లు, అల్లుళ్ల రాకతో పల్లెలు కోలాహలంగా మారాయి. నిన్నంతా భోగి భాగ్యాలతో సంబరాలు జరుపుకున్న తెలుగు ప్రజలు.. నేడు సంక్రాంతికి స్వాగతం చెబుతూ తెల్లవారుజాము నుంచే సందడి చేస్తున్నారు. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు, ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు.. వేకువజామునే జంగమదేవరల జేగంటలు, ఢమరుక నాదాలూ అక్కడక్కడా పిట్టలదొరల బడాయి మాటలతో పట్టణాలు, పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి.

నింగిని తాకిన సంక్రాంతి సంబరాలు..! సంతోషాల ఊయల్లో తెలుగు లోగిళ్లు!!

కృష్ణమ్మ నదీ తీరాన సంక్రాంతి వేడుకలు అంగరంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పర్యాటకాన్ని పెంచేందుకు ఏపీ టూరిజం ఆధ్వర్యంలో సంబురాలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెయింటింగ్ కళాకారులు.. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా చిత్రాలు గీశారు. వారి బొమ్మల్లో పల్లెదనం కళ్లకు కట్టేలా చూపించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భవానీ ద్వీపంలో యువత, నగర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బోటింగ్ లో విహరిస్తూ కృష్ణమ్మ అందాలు చూశారు. సెల్పీలు దిగి కుటుంబ సభ్యులతో హాయిగా గడిపారు.

కర్నూలులో వాసవీ సేవాదళ్‌ ఆధ్వర్యంలో... సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పిల్లలందరికీ పెద్దలు భోగిపళ్లు పోశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను కట్టిపడేశాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

విశాఖలోనూ సంక్రాంతి శోభ ఉట్టిపడింది. V.M.R.D.A బాలల ప్రాంగణంలో నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దు మేళలు సందడి చేశాయి. చిన్నారులు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చెంచులు సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అడవిలో చెంచులక్ష్మీ, శ్రీకృష్ణుణ్ని ప్రేమ కలాపం ఇతివృత్తంగా నృత్యం చేస్తూ అలరించారు.

ప్రకాశం జిల్లా చీరాల సంతబజార్‌లో శ్రీ భద్రావతి సమేత శ్రీ బావనారుషిదేవాలయంలో.... స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సందర్భంగా 10 రోజులపాటు జరగనున్న ఉత్సవాల్లో విశేషపూజల, కల్యాణం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ముందుగా మేళతాళాలతో నగరోత్సవం నిర్వహించారు. 216 మంది మహిళలు బిందెలతో స్వామివారికి జలాభిషేకం చేశారు. గుంటూరులోని సంపత్‌నగర్‌లోని అయ్యప్పస్వామి ఆలయంలో మకరజ్యోతి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి అభరణాలను, ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం శబరిమలైలో కనిపించే జ్యోతి దర్శనం తరహాలో మకరజ్యోతిని వెలిగించారు. ఈ విధంగా సంక్రాంతిని మరింత కాంతివంతంగా జరుపుకున్నారు తెలుగు ప్రజలు.

ఇదీ చదవండి: Chirnjeevi:డోకిపర్రు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న చిరంజీవి దంపతులు

Last Updated : Jan 15, 2022, 7:52 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.