ETV Bharat / city

SAND PROBLEMS: మళ్లీ ఇసుక కష్టం..!

రాష్ట్రంలో రీచ్‌ల నుంచి ఇసుక లోడింగ్‌లో జాప్యం కొనసాగుతోంది. లోడింగ్‌కు రెండు రోజుల సమయం పట్టడంతో.. అందుకు అవుతున్న లారీ కిరాయిలు.. కొనుగోలుదారులపై మోయలేని భారాన్ని వేస్తున్నాయి. కొత్త సంస్థకు బాధ్యతలు అప్పగించాక.. కొన్ని రీచ్​లలో ఇసుకను తవ్వి నిల్వలకు పంపుతుండగా.. మరికొన్ని రీచ్​లు ఇంతవరకు తెరుచుకోనేలేదు. ఏదేమైనా.. ఇసుక కష్టాలతో ప్రజలు చాలాకాలం నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

SAND PROBLEMS
మళ్లీ ఇసుక కష్టం
author img

By

Published : Jul 4, 2021, 4:54 AM IST

రీచ్‌ల నుంచి ఇసుక లోడింగ్‌లో జాప్యం.. కొనుగోలుదారులకు భారంగా మారింది. ఎన్ని రోజులు వేచి ఉంటే.. అన్ని రోజుల కిరాయిని లారీల యజమానులు వసూలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలను చేపట్టిన జేపీ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఇంకా పూర్తి స్థాయిలో రీచ్‌లను తెరవలేదు. కొన్ని తెరిచినా వాటిలో తవ్విన ఇసుకలో దాదాపు సగానికిపైగా వర్షాకాలపు అవసరాలకు ముందస్తు నిల్వల కోసం తరలిస్తున్నారు. మిగిలిన కొద్దిపాటి రీచ్‌లలోనే ప్రజలకు అవసరమైన ఇసుక సరఫరా చేస్తున్నారు.

రీచ్‌కు సమీపంలో ఉండే ప్రాంతాల లారీలకు రోజుకు రెండు, మూడుసార్లు ఇసుక లోడ్‌ చేస్తుండగా.. దూర ప్రాంతాల నుంచి వచ్చిన లారీలకు ఒక్క ట్రిప్‌ కూడా లోడ్‌ చేయడం లేదు. ఉదాహరణకు పశ్చిమగోదావరి జిల్లాలోని నడిపూడి, సిద్ధాంతం రీచ్‌లకు భీమవరం, పాలకొల్లు, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి వెళ్లిన లారీలు.. రెండు రోజులకుపైగా వేచి ఉండాల్సి వస్తోంది. కృష్ణా జిల్లాలోని మున్నలూరు, ఇసుకేపల్లి రీచ్‌లకు విజయవాడ, ఇబ్రహీంపట్నం, తిరువూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చే లారీలదీ ఇదే పరిస్థితి. వేచి ఉండే సమయానికి డ్రైవర్‌, క్లీనర్లకు అదనపు బత్తా ఇవ్వాల్సి వస్తోందంటూ.. కొనుగోలుదారుల నుంచి ప్రతి ట్రిప్‌లో రూ.3 వేల నుంచి రూ.4 వేలను అదనంగా తీసుకుంటున్నారు.

తూకపు యంత్రాలు ఏవి..?

రాష్ట్రంలోని అనేక రీచ్‌లలో తూకపు యంత్రాలు లేవు. ఏపీఎండీసీ నుంచి దాదాపు 115 తూకపు యంత్రాలను జేపీ సంస్థకు అప్పగించారు. వీటిలో చాలావరకు మూలన పడ్డాయి మరోవైపు జేపీ సంస్థ తూకపు యంత్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. చాలాచోట్ల లేవు. దీంతో లారీల్లో అంచనా మేరకు ఇసుక లోడింగ్‌ చేస్తున్నారు. అయితే దారిలో అధికారులు తనిఖీ చేసినప్పుడు అదనపు లోడ్‌ ఉందంటూ కేసులు పెడుతున్నారు.

లోడింగ్‌లో జాప్యం చేస్తున్నారు..

"రీచ్‌లలో సకాలంలో ఇసుక లోడింగ్‌ చేయట్లేదు. వందల్లో లారీలు ఆగిపోవాల్సి వస్తోంది. ప్రజలకు అవసరమైన ఇసుకను వేగంగా లోడింగ్‌ చేయకుండా, స్టాక్‌యార్డ్‌కు తరలించే వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు." - ఎ.చిట్టిబాబు, ఇసుక లారీ యజమానుల సంఘం, విజయవాడ

గిట్టుబాటు కావడం లేదు..

"కడప నుంచి 40 కి.మీ. దూరంలో నందలూరువద్ద రీచ్‌కు వెళితే.. రెండు రోజులకుగానీ లోడింగ్‌ కావడం లేదు. డ్రైవర్‌కు రెండు రోజుల బత్తా ఇవ్వాల్సి వస్తోంది. ప్రజలను అదనపు డబ్బులు అడగాల్సి వస్తోంది. అయినా గిట్టుబాటు కావడం లేదు. రోజుకు రెండు, మూడు ట్రిప్పులు నడిస్తే మాకు మిగులుతుంది." - మునయ్య, ట్రాక్టర్‌ యజమాని, కడప

ఇళ్ల పథకానికి తీసుకెళ్తేనే..

పేదలకు సామూహికంగా కడుతున్న ఇళ్లకు ఇసుక రవాణా చేస్తేనే.. మామూలు కొనుగోళ్లకు ఇసుకను లారీల్లో లోడ్‌ చేస్తామంటూ మెలిక పెడుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణానికి ఇసుక రవాణా కాంట్రాక్టును ఓ సంస్థ తీసుకుంది. వాళ్లు లారీ యజమానులపై ఒత్తిడి చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో దీనిని బలవంతంగా అమలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

KRISHNA WATER: కడలిలోకి కృష్ణమ్మ.. రోజూ అర టీఎంసీ వృథా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.