ETV Bharat / city

స్థానిక ఎన్నికలు జరిగితే...కరోనా ఆపొచ్చు :సజ్జల - ap local elections news

స్థానిక ఎన్నికల వాయిదా విషయంలో ఎస్​ఈసీ రమేశ్ కుమార్​పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. వాయిదాకు సంబంధించిన నిర్ణయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎన్నికలు 5, 6 వారాలు వాయిదా పడితే తెదేపా ఏం సాధిస్తుందని, రాష్ట్రానికి 5 వేల కోట్ల నిధులు పోతాయన్నారు. ఎన్నికలు జరిగితే క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనా వ్యవస్థ ఏర్పడుతుందని.., కరోనా ఎదుర్కొనేందుకు అది తోడ్పతుందని అన్నారు.

sajjla ramakrishnareddy comments on karona virus

author img

By

Published : Mar 16, 2020, 5:23 PM IST

Updated : Mar 16, 2020, 5:58 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో ఎస్​ఈసీ రమేశ్ కుమార్​ పరిధి మరిచి వ్యవహరించారని... ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రమేశ్ కుమార్ నిర్ణయం తప్పని అన్నారు. దురాలోచనతో తీసుకున్న నిర్ణయంగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ గురించే ఆలోచించి ఉంటే అందరిని సంప్రదించి ఉండాల్సిందన్నారు. ఎన్నికల కమిషనర్ అనే వారు ఓ వ్యక్తి కాదు ఓ వ్యవస్థ అని, అఖిలపక్షంలో పార్టీలు కోరినప్పుడు ఒకలా.. నిన్న మరోలా స్పందించడం ఏమిటని ప్రశ్నించారు.

'కరోనా వైరస్ అంటే ఏంటో ఎవరికి తెలియదు. కరోనాను నియంత్రించేందుకు అగ్రరాజ్యమైన అమెరికానే మల్లగుల్లాలు పడుతోంది. మన రాష్ట్రం నియంత్రించగలదా ..? వ్యాక్సిన్లు ఇస్తే పోవడానికి అదేమైనా కలరానా? ప్రపంచ దేశాలే ఎలా నియంత్రించాలని ఆలోచిస్తున్నాయి. అలాంటి కరోనాను తట్టుకోవాలన్నా...క్షేత్రస్థాయిలో నియంత్రించేందుకు ఉపయోగపడేదే ఈ లోకల్​ బాడీ వ్యవస్థ. ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు ఉంటే...వాలంటీర్ల సహకారంతో ఊర్లోకి కొత్త వాళ్లు ఎవరు వస్తున్నారు? ఏమైనా రోగాలున్నాయా అనేది గుర్తించవచ్చు. అలాంటి వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక రకమైన విరుగుడు మాత్రమే. ఈ వ్యవస్థ తయారవ్వడం అనేది కేవలం పది రోజుల్లో అయిపోతుంది. ఓ చట్రంలా తయారయ్యే వ్యవస్థతో ఈ అర్థం కాని కరోనా వ్యాధిని డీల్ చేసే అవకాశం ఉంది. అలాంటి దానికి చివర్లో అడ్డం పడ్డారు.'

- సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు

మీడియాతో మాట్లాడుతున్న సజ్జల

ఉద్దేశ్యం ప్రకారమే నిలిపివేత

వాయిదాకు సంబంధించిన నిర్ణయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ప్రకటించడాన్ని సజ్జల తప్పుబట్టారు. ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కమిషనర్ బాధ్యతని, ఎన్నికలకు సంబంధం లేకుండా ముందే ప్రకటించిన ఉచిత ఇంటి స్థలం పథకాన్ని ఉద్దేశ్య ప్రకారం నిలిపి వేసినట్టు అనిపిస్తోందన్నారు. కమిషనర్ ఆలోచన ప్రకారం చూస్తే రేషన్ పంపిణీ కూడా ప్రలోభం కిందే వస్తుందా అని ప్రశ్నించారు.

గేట్లు తెరిస్తే అంతే సంగతులు

గోవాలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని, అక్కడ నిలుపుదల చేయలేదు కదా అని సజ్జల అన్నారు. నిబద్ధత ఉంటే ఎస్ఈసీ ఈ పని చేసి ఉండేవారు కాదన్నారు. తెదేపా నుంచి చాలా మంది తమతో టచ్​లో ఉన్నారని, తమ విధానాలు నచ్చి కొందరు, చంద్రబాబు పై విశ్వాసం లేక కొందరు వైకాపాలోకి వస్తున్నారని చెప్పారు. తాము గేట్లు తెరవడం లేదు కాబట్టే అంతా ఆగి ఉన్నారని వెల్లడించారు.

కేంద్రానికి లేఖ రాస్తాం

ఎన్నికలు 5, 6 వారాలు ఆగితే తెదేపా ఏం సాధిస్తుందని అడిగిన సజ్జల.. వాయిదాతో రాష్ట్రానికి రావాల్సిన 5 వేల కోట్ల నిధులు పోతాయన్నారు. ఏపీ అంటే గిట్టని శక్తులన్నీ ఏకం అయ్యి ఈ తరహా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్​కు విచక్షణ ఉంటే ఆయన తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనాను బూచిగా చూపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, స్థానిక సంస్థలకు ప్రాణం పోయాల్సిన ఆ సంస్థే ఇలా వ్యవహరించటం తగదన్నారు. ప్రస్తుతం పరిస్థితి తమ నియంత్రణలో లేనందున ఈ నిర్ణయం పై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అలాగే నిధుల గురించి కూడా కేంద్రానికి లేఖ రాస్తామని సజ్జల స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ప్రలోభాలకు లొంగకండి...పునరాలోచించండి : వైకాపా నేతలు

Last Updated : Mar 16, 2020, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.