Sajjala On BJP: వైకాపా ప్రభుత్వంపై భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల స్పందించారు. తమ ప్రభుత్వంపై భాజపా నేతల ఆరోపణలు అనుచితమని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నేతల వ్యాఖ్యల వెనుక ఎవరో ఉన్నారనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. భాజపాలో ఉన్న తెదేపా ఎంపీలే కీ రోల్ పోషిస్తున్నారన్న ఆయన.. భాజపాకు మతం తప్ప వేరే అంశం లేదంటూ విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్నది రామరాజ్యమే అంటూ బదులిచ్చారు.
విజయవాడలో భాజపా సభ.. ప్రకాశ్ జావడేకర్ కీలక వ్యాఖ్యలు
Prakash Javadekar Comments on TDP and YCP: వైకాపా, తెదేపా, తెరాస.. మూడూ కుటుంబ పార్టీలే... ఈ 3 ప్రాంతీయ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ ఆరోపించారు. విజయవాడలో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆగ్రహ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీలో తెదేపా, వైకాపా రెండూ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. ‘‘
"ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోంది. మద్య నిషేధం అని చెప్పి మద్యంపై వచ్చిన డబ్బుతోనే పాలన సాగిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏవీ జగన్ నెరవేర్చలేదు. కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఇక్కడ కట్టించేది జగనన్న కాలనీలు కాదు.. మోదీ కాలనీలు. నా హయాంలోనే పోలవరానికి అనుమతులు వచ్చాయి. అనుమతులు ఇచ్చి ఏడేళ్లయినా పోలవరం పూర్తి చేయలేదు. అమరావతి కోసం అటవీ భూములను బదిలీ చేశాం. రాజధాని విషయంలో తెదేపా, వైకాపా ఘర్షణ పడుతున్నాయి. ఈ రాష్ట్రానికి మేలు చేసే నాయకత్వం తప్పక అవసరం. ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే" -’ ప్రకాశ్‌జావడేకర్, భాజపా సీనియర్ నేత
జగన్ అది చూపించే పార్టీ మాదే - సోము వీర్రాజు
somu veerraju fires on YCP: తెదేపా, వైకాపా ప్రభుత్వాలు ఏపీని అభివృద్ధికి దూరం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని, కేంద్ర పథకాలకు వైకాపా స్టిక్కర్లు అంటిస్తున్నారని విమర్శించారు.
"‘జగన్‌కు ఏం చూపించాలో అది చూపించే పార్టీ మాదే. మనం ఎందుకు భయపడాలి? మనం ఎప్పుడైనా జైలుకు వెళ్లామా.. భవిష్యత్తులో వెళ్తామా? పలు చోట్ల ఆస్తులు పోగేసుకునేందుకే ఈ నేతల తాపత్రయం. రాజకీయాల్లో నిరాడంబరత్వం చూపించిన పార్టీ మాదే. ఏపీలోని అనేక హైవేలను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. భాజపా అధికారంలోకి వస్తేనే ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధ్యం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ సభ పెట్టాం. వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రావాలి. ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారని ముందు చంద్రబాబును అడగాలి. ప్రత్యేక హోదా .. నీతి ఆయోగ్ పరిధిలో ఉంది. రాష్ట్రంలో అన్నీ అమ్మేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికీ కాపాడుతున్న పార్టీ మాదే. స్టీల్ ప్లాంట్ నష్టం రూ.3వేల కోట్లను ఇప్పటికీ భర్తీ చేస్తున్నాం. యూనియన్ల పేరుతో పాఠశాలలను సర్వనాశనం చేసింది కమ్యూనిస్టులే" - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఆ వైరస్‌కు మోదీ వ్యాక్సినే మందు..
"రాష్ట్రానికి 2019లో ఒక వైరస్ సోకింది. ఆ వైరస్‌తో రాష్ట్రంలో ఒక్కో వ్యవస్థ నాశనం. రాష్ట్రానికి సోకిన వైరస్‌కు మోదీ వ్యాక్సినే మందు. కర్నూలుకు హైకోర్టు తీసుకెళ్లేందుకు ఏమైనా ప్రయత్నించారా? రాయలసీమకు పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏమైనా వచ్చాయా? విభజన చట్టంలోని అంశాల్లో 85 శాతం పూర్తి చేశాం. రాష్ట్రాల నిర్లక్ష్యం వల్లే మిగతా అంశాలు పెండింగ్ ఉన్నాయి. ఏపీలో అవినీతి, అసమర్థ, కుటుంబపాలనకు స్వస్తి చెప్పాలి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాల్సిన అవసరం ఉంది" - సత్యకుమార్,భాజపా నేత
ఇదీ చదవండి: