ETV Bharat / city

జగన్ పాదయాత్రకు మూడేళ్లు.. 10 రోజులపాటు ఉత్సవాలు - జగన్ పాదయాత్రకు మూడేళ్లు

జగన్ పాదయాత్ర చేపట్టి నవంబర్ 6 నాటికి 3 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 10 రోజులపాటు ఉత్సవాలను జరపాలని వైకాపా నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొనాలని పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు.

sajjala ramakrishna reddy
sajjala ramakrishna reddy
author img

By

Published : Nov 4, 2020, 11:03 PM IST

నవంబర్ 6 నాటికి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించి 3 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పది రోజుల పాటు ఉత్సవాలు జరపాలని వైకాపా నిర్ణయించింది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ... సమస్యలు తీర్చేలా కార్యక్రమాలను చేపట్టాలని కార్యకర్తలకు ఆ పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ప్రజలంతా ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.

పాదయాత్ర అంశాలు సహా పాలనపై తెలియజేస్తూ ప్రత్యేకంగా రూపొందించిన సీడీలు, పోస్టర్ లను తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. 17 నెలల పాలనలో ప్రజల జీవన పరిస్ధితులను మార్చేశారని.. ఓ అరుదైన నాయకుడిగా సీఎం వైఎస్ జగన్ సాక్షాత్కరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 95 శాతం ప్రజలు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందారని... అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ నెల 6 నుంచి పది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సీపీఎం కౌంటర్‌ దాఖలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.