ETV Bharat / city

ఇళ్లలోనే ఉంటే ఎలాంటి సమస్య రాదు: సజ్జల - caroona cases in ap

కరోనా వైరస్ దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలు జరపాలా.. వద్దా అనే విషయంపై చర్చిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని... ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అలా చేస్తే శానిటైజర్స్​ అవసరం కూడా ఉండదన్నారు.

sajjala comments  on corona awareness
sajjala comments on corona awareness
author img

By

Published : Mar 24, 2020, 7:58 PM IST

మీడియాతో మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి

కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. స్వీయ నిర్భంధం, సామాజిక దూరం పాటించడం వల్ల వైరస్ వల్ల వచ్చె పెను ప్రమాదాన్ని తప్పించుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. కొన్నిచోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటం లేదని.. గుంపులుగా తిరుగుతున్నారని అన్నారు. ఈ తరహా చర్యలు ప్రమాదకరమని హెచ్చరించారు.

విపత్తు నివారణకు ప్రభుత్వం చేయగలిగినంత వరకు చేస్తుందని.. ప్రజల సహకారం లేకపోతే ప్రభుత్వం ఎంత చేసినా ప్రయోజనం ఉండదన్నారు. ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా శాసన సభ సమావేశాలు జరపాలా వద్దా అనే విషయంపై చర్చిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. కరోనా వ్యాప్తితో విపత్కర పరిస్థితులున్న ప్రస్తుత పరిస్ధితుల్లో.. చంద్రబాబు రాజకీయాలు మాట్లాడటం సరైంది కాదన్నారు.

ఇదీ చదవండి :

కరోనా నివారణకు ఈ 5 సూత్రాలను పాటించండి !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.