తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె.. రోజు రోజుకూ తీవ్రమవుతోంది. సమస్యల పరిష్కారం కోసం కార్మికుల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను ఆ రాష్ట్ర పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో కార్మికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రెండు రోజులుగా తన నివాసంలోనే అశ్వత్థామరెడ్డి దీక్ష చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తా: అశ్వత్థామరెడ్డి
ఆస్పత్రిలోనూ నిరహార దీక్ష కొనసాగిస్తానని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. రెండు రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తున్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు.
ఇదీ చూడండి: