ETV Bharat / city

దూకుడు: ఆర్టీసీ కార్గోలో చికెన్ నుంచి చీరల వరకూ... - అంకాపూర్​ చికెన్

అంకాపూర్ చికెన్, సిద్దిపేట్, కరీంనగర్ సర్వపిండి, సకినాలు, గారెలు, అప్పచ్చులు.. ఒకటేమిటి... మీకు ఏది.. ఎప్పుడు.. తినాలనిపించినా.. గంటల్లో ఆర్టీసీ వాటిని మీ చెంతకు చేర్చుతుంది. ఇప్పటికే 350కి పైగా అంకాపూర్ చికెన్ పార్శిళ్లను హైదరాబాద్ వాసులకు వేడివేడిగా అందజేసింది. ఇప్పుడు మీకు నచ్చిన.. మీరు మెచ్చిన తెలంగాణ వంటకాలను మీవద్దకు చేర్చేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. మగువలకు నచ్చిన పోచంపల్లి, గద్వాల్ చీరెలను.. ఆర్డర్ చేసిన రోజే నేరుగా ఇంటికే అందజేస్తుంది.

rtc cpc services from districts
దూకుడు: ఆర్టీసీ కార్గోలో చికెన్ నుంచి చీరల వరకూ...
author img

By

Published : Oct 11, 2020, 10:32 PM IST

తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్శిల్, కొరియర్ సర్వీసులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వినూత్నంగా అడుగులు వేస్తోంది. అందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని.. తెలంగాణ వంటకాల తయారీదారులతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇప్పటికే 350 అంకాపూర్​ చికెన్​ పార్శిళ్లు, 150 మొక్కజొన్న పార్శిళ్లను హైదరాబాద్​ వాసులకు వేడివేడిగా పార్శిల్​ అందించింది ఆర్టీసీ.

హైదరాబాద్​ వాసులకు పార్శిల్​ పంపేందుకు గానూ ఆర్టీసీ అంకాపూర్​లో ఏకంగా చికెన్, మొక్కజొన్న కంకుల పార్శిల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నోరూరించే అంకాపూర్​ నాటుకోడి కూరను.. హైదరాబాద్ వాసులు భలే ఇష్టంగా ఆరగించేస్తున్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కు ఎక్కువ బస్సు సర్వీసులు ఉండడం వల్లనే ఇది సాధ్యమైందని ఆర్టీసీ కార్గో,పార్శిల్, కొరియర్(సీపీసీ) ప్రత్యేక అధికారి కృష్ణకాంత్ తెలిపారు.

సిద్దిపేట, కరీంనగర్ ప్రాంతాల్లో చేసే పిండివంటలను కూడా పార్శిల్ చేసేందుకు ఆర్టీసీ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో వారంరోజుల్లో ఇవి కూడా అందుబాటులోకి వస్తాయని అంచనావేస్తున్నారు. సిద్దిపేట, కరీంనగర్​లో తయారు చేసే సర్వపిండి, సకినాలు, గారెలకు హైదరాబాద్ వాసుల నుంచి భారీ డిమాండ్ ఉందని ఆర్టీసీ సీపీసీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయా వంటకాలు తయారు చేసే వారితో సంప్రదింపులు చేశామని పేర్కొన్నారు.

మగువలు మెచ్చే చీరలు సైతం..

మహిళల మనసులు దోచే... పోచంపల్లి, గద్వాల్ చీరలను సైతం పార్శిల్ చేసేలా చర్చలు జరుపుతున్నట్లు ఆర్టీసీ సీపీసీ అధికారులు తెలిపారు. వీటితో పాటు నిర్మల్ పెయింటింగ్స్ కూడా పార్శిల్ చేయానున్నారు. ఈ అంశంపై.. తెలంగాణ సాంస్కృతిక శాఖతో చర్చిస్తున్నామన్నారు.

నిర్మల్​ పెయింటింగ్స్​కి సంబంధించి వారు ఒక వెబ్​సైట్ డిజైన్ చేసుకుంటే సరిపోతుందని... ఆ సైట్​ను సీపీసీతో అనుసంధానం చేస్తామని అధికారులు వివరించారు. నిర్మల్​ బొమ్మలు కావాల్సిన వారు.. ఆన్​లైన్​లో బుక్ చేసుకుంటే.. ఆర్టీసీ కొరియర్ ద్వారా వాటిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తుందన్నారు. చేనేత కళాకారులకు తమవంతు చేయూతనిచ్చేందుకు ఈ ఆలోచన చేస్తున్నామని అధికారులు వివరించారు.

పోస్టల్​, ఎయిర్​ సర్వీసులు కూడా..

పోస్టల్ డిపార్ట్​మెంట్​తో కూడా ఆర్టీసీ కార్గో, పార్శిల్, కొరియర్ సర్వీసు(సీపీసీ) ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం నుంచి ఈ సేవలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్రకుమార్​తో సీపీపీ ప్రత్యేక అధికారి కృష్ణకాంత్ చర్చలు జరిపారు. మూడు రూట్లలో పోస్టల్ ఎక్స్​ప్రెస్ మెయిల్ సర్వీసులు చేసేందుకు పోస్టల్ అధికారులతో అంగీకారం కుదిరిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు చేర్చే పార్శిళ్లను అబిడ్స్, నాంపల్లి, బేగంపేట్ ప్రాంతాల నుంచి పికప్ చేసుకుంటామన్నారు.

ప్రతి రోజూ సాయంత్రం నాలుగు గంటలకు పార్శిల్ అందజేస్తే.. రాత్రి పది నుంచి 11గంటల మధ్య హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు చేర్చుతామని పేర్కొన్నారు. వీటితో పాటు వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ప్రాంతాలకు కూడా రోజూ వారి పార్శిళ్లు చేరవేసేందుకు పోస్టల్ అధికారులు అంగీకరించారన్నారు. వీటితో పాటు ఎయిర్ కార్గోతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సీపీసీ అధికారులు తెలిపారు. ఇంకా చర్చల దశలోనే ఉన్నాయని.. చర్చలు విజయవంతమైతే... ఎయిర్ పోర్ట్ నుంచి కూడా సీపీసీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

ఇవీ చూడండి: దుబ్బాకలో ఊపందుకున్న ఉపఎన్నికల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.