ఉద్యోగుల పీఆర్సీకి, ఆర్టీసీ పీఆర్సీకి సంబంధం లేదని ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున్ రెడ్డి చెప్పారు. పీఆర్సీ కోసం ఉద్యోగులు సమ్మెకు వెళ్తామని చెప్పారని.. సమ్మెపై పునరాలోచించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీ సమస్యలను సీఎం జగన్ పరిష్కరిస్తున్నారన్నారు. కష్టకాలంలో ఉద్యోగులు.. ప్రభుత్వానికి అండగా నిలవాలని చెప్పారు. ఒకవేళ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే.. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రత్యామ్నాయంపై ఎండీతో చర్చిస్తామని చెప్పారు.
రెండేళ్లలో అప్పులన్నీ తీర్చాలని సీఎం ఆదేశించారని.. కరోనా వల్ల ఆశించిన స్థాయిలో అప్పులు తీర్చలేకపోయామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: EMPLOYEES AGITAION DHARNA CHOWK:నిర్భందాలను ఛేదించుకుని విజయవాడకు ఉద్యోగులు