ETV Bharat / city

THEFT: షట్టర్ తాళాలు పగలగొట్టి చోరీ..

మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని ఓ కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. 40 వేల రూపాయలతో పాటు 40 తులాల వెండి ఎత్తుకెళ్లారు.

Theft at the grocery store
కిరాణా దుకాణంలో చోరీ
author img

By

Published : Aug 1, 2021, 12:24 PM IST

అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో జరిగింది. ఓ కిరాణా దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టి లోనికి చొరబడి రూ.40వేల నగదుతో పాటు దుకాణంలో ఉన్న సుమారు 40 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు దుకాణ యజమాని భన్వర్ లాల్ తెలిపారు. పక్కనే ఉన్న జై భవాని జ్యూవెల్లరీ దుకాణంలో చోరీ చేసేందుకే గ్రిల్స్​ను గడ్డపారాలతో తొలగించేందుకు యత్నించగా విఫలం చెందారు. మొత్తం నలుగురు సభ్యుల ముఠా చోరీకి పాల్పడినట్లు సీసీటీవీలో దృశ్యాలు నమోదయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దొంగతనం జరిగిందిలా..

ముందుగా ఇద్దరు దుకాణం వద్దకు గునపాలతో వచ్చారు. తరువాత షట్టర్ తాళాలు పగలగొట్టారు. అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. ఇద్దరు బయట ఉండగా ఒకరు దుకాణంలోకి వెళ్లారు. లోపలికి వెళ్లిన వాడు దుకాణంలోని గల్లాపెట్టెను బయట ఉన్నవాడికి ఇచ్చాడు. తర్వాత వెండి వస్తువులు తీసుకెళ్లారు. వీరు చేసిదంతా సీసీటీవీలో రికార్డు అయింది. దొంగతనానికి పాల్పడిన ముగ్గురు.. ముఖాలకు అడ్డుగా మాస్క్ కట్టుకున్నారు.

కిరాణా దుకాణంలో చోరీ

ఇదీ చదవండి:RRR movie: ఆర్​ఆర్​ఆర్​ ట్రీట్​.. 'దోస్తీ' సాంగ్​ వచ్చేసింది​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.