viral video: తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యం అందరినీ కలచి వేసింది. పట్టణంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న ప్రియ.. ఈరోజు ఉదయం ఎప్పటిలానే తన ద్విచక్ర వాహనంతో బయలుదేరింది. స్థానిక వివేకానంద విగ్రహం వద్ద రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. లారీ చక్రాల కింద పడిపోయిన ప్రియ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: