అమరావతి ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. లింగాయపాలెంకు చెందిన ఇద్దరు యువకులు సీడ్ యాక్సిస్ రోడ్డుపై ద్విచక్రవాహనంపై వెళ్తుండగా...కారు ఢీకొట్టింది. ప్రమాదంలో పులి పున్నయ్య, ప్రకాష్ అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పులి పున్నయ్య తలకు తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీచదవండి