ETV Bharat / city

తెలంగాణ: మల్కాపూర్ గేటు వద్ద ఘోరప్రమాదం.. ఏడుగురు మృతి - accident news in telangana latest

road-accident-at-chevella-6-members-dead

author img

By

Published : Dec 2, 2020, 8:15 AM IST

Updated : Dec 2, 2020, 10:08 AM IST

08:13 December 02

మల్కాపూర్ గేటు వద్ద ఘోరప్రమాదం.. ఏడుగురు మృతి

రంగారెడ్డి చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్​-బీజాపూర్​ రహదారిపై బోర్‌వెల్‌ వాహనం-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు.  

ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా సికింద్రాబాద్​లోని తాడ్​బండ్​కు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో అసిఫ్​ఖాన్(50), సానియా(18), నజియాబేగం(45), హర్ష(28), నజియాభాను(36), హర్షభాను(6) మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా మహబూబ్​నగర్​ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: పట్టు వీడని రైతన్న- రేపు కేంద్రంతో మరోసారి భేటీ

Last Updated : Dec 2, 2020, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.