రాష్ట్రంలో భూముల రీసర్వేపై రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్షించారు. 50 గ్రామాల్లో మ్యాపింగ్, పరిశీలన పూర్తి చేశామని అధికారులు మంత్రికి వివరించారు. ఈ నెలాఖరుకు 50 గ్రామాల్లోనూ రీసర్వే పూర్తవుతుందని వెల్లడించారు. 70 శాతం భూముల రీసర్వే స్టేటస్‌ను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. జిల్లాలోని ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే చేయాలని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ శాఖలోని వీఆర్ఏ, వీఆర్‌వో పదోన్నతుల అంశంతో పాటు.. విశాఖ పెట్రో కెమికల్ వర్సిటీకి 23 ఎకరాల భూ వివాదంపైనా చర్చించారు.
ఇదీ చదవండి