ETV Bharat / city

రోజురోజుకూ తీవ్రంగా పెరుగుతున్న రెవెన్యూ లోటు - రెవెన్యూ లోటు

రాష్ట్రంలో రెవెన్యూలోటు తీవ్రంగా పెరుగుతుంది. గతేడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాదికి రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

పెరుగుతున్న రెవెన్యూ లోటు
author img

By

Published : Sep 28, 2019, 6:40 AM IST

పెరుగుతున్న రెవెన్యూ లోటు

రాష్ట్రంలో రెవెన్యూ లోటు రోజురోజుకూ తీవ్రంగా పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటు నమోదు అవుతోంది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాతో పాటు గ్రాంట్లు, ఇతర ఆదాయాలు, ఘననీయంగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ 16 నాటికి రాష్ట్రంలో రూ.46 వేల 336 కోట్ల రెవ్యెన్యూ వసూళ్లు నమోదయ్యయి.

2018 19 సంవత్సరానికి ఇదే సమయానికి రూ.54వేల 396కోట్లుగా నమోదయ్యింది. పన్నురాబళ్లు, మోటరు వెహికల్​పై పన్నులు, వస్తు సేవలపై విధించే పన్నులు, విద్యుత్ ఇతర వస్తువులకు సంబంధించిన పన్నులు, జీఎస్టీ, అబ్కారీ, స్టాంపులు, రిజిస్ర్టేషన్​లు, నాలా పన్నులు, వినోదపు పన్నులు, గనులు ఇలా వివిధ ఆదాయ మార్గాల నుంచి వసూళ్లు ఘననీయంగా తగ్గాయి.

కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలోనూ రమారమీ రూ.2వేల కోట్ల మేర తగ్గుదల నమోదయ్యింది. కేంద్ర గ్రాంట్లలోనూ రూ.2వేల కోట్ల తగ్గుదల నమోదయ్యింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక్కపైసా రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదు. ఫలితంగా రెవెన్యూ లోటు భారీగా పెరిగిపొయింది. రుణాల రికవరీ, పబ్లిక్ డెట్ రుణాలు కూడా తగ్గడంతో పాటు ప్రజారుణాల వాటా పెరుగుతోంది. ప్రభుత్వ రోజువారి కార్యకలపాలు, జీతాల చెల్లింపులు, లావాదేవిలపై ప్రభావం పడుతోంది.

ఇదీ చదవండీ... వివేకా హత్యకేసు... మరో మలుపు..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.