ETV Bharat / city

Voting From Jail: ఎమ్మెల్సీ ఎన్నికలు.. జైలులో ఉన్న ఆ ఇద్దరికీ ఓటు వేసే అవకాశం

author img

By

Published : Dec 10, 2021, 9:30 AM IST

Voting From Jail : తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఓటర్లు తమ ఓటు హక్కును చంచల్‌గూడ జైలు నుంచి వినియోగించుకోనున్నారు. అండర్‌ ట్రయల్ ఖైదీగా ఉన్న ఇద్దరు ఓటర్ల అభ్యర్థన మేరకు.. జిల్లా ఎన్నికల అధికారులు చంచల్‌గూడ జైలుకు రెండు పోస్టల్‌ బ్యాలెట్లను పోస్టు చేశారు.

central jail
central jail

Voting From Jail : తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఓటర్లు తమ ఓటు హక్కును చంచల్‌గూడ జైలు నుంచి వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతోపాటు మున్సిపల్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, నగరపంచాయతీ సభ్యులై ఉండాలనేది నిబంధన. వీరితో పాటు ఎక్స్‌ అఫీషియో సభ్యులకు ఓటువేసే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 937 మంది ఓటర్లుంటే భైంసాకు చెందిన అబ్దుల్ ఖదీర్, విజయ్‌కుమార్‌ అనే ఇద్దరు ప్రజాప్రతినిధులు చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారు పెట్టుకున్న విజ్ఞప్తి మేరకు.. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ పంపించారు.

Postal Ballot for Prisoners : చంచల్‌గూడ జైలులో ఉన్న ఇద్దరు ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారు వేసిన ఓట్లు ఈనెల 14 ఓట్లలెక్కింపునకు ముందు జిల్లా ఎన్నికల అధికారులకు పంపించాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దండె విఠల్, పెందూర్‌ పుష్పారాణి ఉన్నారు. ఒకవేళ వీరిద్దరికి సమాన ఓట్లు వస్తే పోస్టల్‌ బ్యాలెట్లకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. మరోపక్క నిరక్షరాస్యత కారణంగా 30 మంది ఓటర్లు తమకు సహాయకులను కేటాయించాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరారు. దీంట్లో భాగంగా శుక్రవారం జరిగే పోలింగ్‌లో వారికి అవకాశం కల్పిస్తూ సహాయ ఎన్నికల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి:

OTS ISSUE: ఎప్పుడో కట్టిన ఇళ్లకు... ఇప్పుడెందుకు వసూళ్లు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.