ఉపాధ్యాయ విద్యా సంస్థల్లోని ఖాళీలను డిప్యూటేషన్‌పై భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీల భర్తీపై న్యాయస్థానంలో కేసులు పెండింగ్‌లో ఉన్నందున బీఈడీ, డీఈడీ కళాశాలల్లో అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు జిల్లాస్థాయిలో సంయుక్త కలెక్టర్ ఛైర్మన్‌గా, జిల్లా విద్యాధికారి కన్వీనర్, సంబంధిత విద్యా సంస్థ ప్రిన్సిపల్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు శనివారం నోటిఫికేషన్ జారీ చేస్తారు. 25 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జులై 2 నుంచి 6 వరకు దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేస్తారు. 7న డిప్యూటేషన్ ఉత్తర్వులు జారీ చేస్తారు.
ఎస్‌సీఈఆర్టీలోనూ..
రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ)లో కూడా ఖాళీ పోస్టులను డిప్యూటేషన్‌పై భర్తీ చేయనున్నారు. బీఈడీ, డైట్ కళాశాలల్లో పనిచేసే సీనియర్ లెక్చరర్లు, ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యా శాఖ సూచించింది.
ఇదీ చదవండి: