ETV Bharat / city

రేపల్లె పట్టణ సీఐ సాంబశివరావు వివాదాస్పద వ్యాఖ్యలు! - రేపల్లె తాజా వార్తలు

ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించిందని.. గ్రామంలో అందరూ చర్చించుకుని ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నగదు వస్తుందన్న రేపల్లె పట్టణ సీఐ సాంబశివరావు చేసిన వాఖ్యలు... ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ప్రభుత్వ అధికారి ఏకగ్రీవ ఎన్నికల గురించి మాట్లాడటం ఏంటంటూ.. విమర్శలు వెల్లువెత్తున్నాయి.

repalle ci on unanimous
రేపల్లె పట్టణ సీఐ సాంబశివరావు వ్యాఖ్యలు వైరల్
author img

By

Published : Jan 30, 2021, 7:27 AM IST

రేపల్లె పట్టణ సీఐ సాంబశివరావు వ్యాఖ్యలు వైరల్

ఎన్నికలకు సంబంధించి గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ సీఐ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో పర్యటించిన సీఐ.. గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా ఏకగ్రీవ ఎన్నికలపై సీఐ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్​గా మారాయి.

ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించిందని.. గ్రామంలో అందరూ చర్చించుకుని ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నగదు వస్తుందని ఆయన తెలిపారు. లేదంటే ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వ అధికారి ఏకగ్రీవ ఎన్నికల గురించి మాట్లాడటంపై ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.

ఇదీ చదవండి:

వైకాపా నేతలు నామినేషన్లు వేయనివ్వటం లేదని ఎస్​ఈసీకి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.