ETV Bharat / city

సీఎం సహాయనిధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.5 కోట్ల విరాళం

కరోనా పై పోరులో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐదు కోట్ల విరాళం ప్రకటించింది.

reliance-industries-donates-rs-5-crore-to-cm-relief-fund

author img

By

Published : Apr 15, 2020, 7:21 AM IST

కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సీఎం సహాయ నిధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 5 కోట్లు విరాళం ప్రకటించింది. సవాళ్లను ఎదురొడ్డుతూ వైరస్‌పై గెలవడానికి.... రిలయన్స్ సంస్థలు క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా సిద్ధమని మద్దతు తెలిపింది. రిలయన్స్ ఫౌండేషన్ దేశంలో మొదటి 100 పడకల కొవిడ్ -19 ప్రత్యేక ఆస్పత్రి సహా... అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేసింది. ఆరోగ్య కార్యకర్తలు, సంరక్షకుల కోసం.... రోజూ లక్ష మాస్కుల ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పింది. పెద్ద సంఖ్యలో పీపీఈలు తయారు చేసి.... వైద్యుల రక్షణకు సహకరిస్తున్నట్లు తెలిపింది. రిలయన్స్ రిటైల్స్ ద్వారా నిత్యం లక్షలాది మందికి నిత్యావసరాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తు చేసింది. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్.... పీఎం కేర్స్ సహాయనిధికి 530 కోట్లకు పైగా అందించింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.