ETV Bharat / city

అమరావతి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూసివేత! - Registration offices in Amravati news

అక్కడ భూమి కొనాలంటే మురిపెం... భూమి అమ్మారంటే లాభం... అందుకే నిత్యం వేలాది లావాదేవీలు జరిగేవి. సర్కారుకు స్టాంప్ డ్యూటీ రూపంలో భారీగానే ఆదాయం సమకూరేది. అదంతా గతం. ఇప్పుడు కొనేవారు లేరు... అమ్మకాలు అసలే లేవు. 3 రాజధానులంటూ ప్రభుత్వం ప్రకటించిన నాటినుంచి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారు లేరు. ఫలితంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని సబ్​రిజిస్ట్రార్ కార్యాలయాలను మూసివేయాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది.

Registration offices will be closed in Amravati
అమరావతి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
author img

By

Published : Aug 8, 2020, 3:21 PM IST

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గుంటూరు రేంజ్ డీఐజీ బాలస్వామి

గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలో రాజధాని నిర్ణయించిన సమయంలో అక్కడి రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం ఉండేది. రాజధాని ప్రాంతానికి అమరావతి అని పేరు పెట్టినా... ఆ తర్వాత భూసమీకరణ, భూముల అభివృద్ధి, రైతులకు ప్లాట్లు కేటాయింపు ఇలా ఎన్నో దశలు. అన్ని సమయాల్లోనూ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఎక్కువగా జరిగేవి. రిజిస్ట్రేషన్ల కోసం తుళ్లూరులో కార్యాలయం లేక అమరావతి, మంగళగిరి, తాడికొండ వెళ్లాల్సి వచ్చేది. అప్పటి డిమాండ్​ని బట్టి ప్రభుత్వం తుళ్లూరులో సబ్​రిజిస్ట్రార్ కార్యాలయం, అనంతవరం, మందడం, ఉండవల్లి ప్రాంతాల్లోనూ 2015లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్ని ఏర్పాటు చేసింది.

భూసమీకరణకు పొలాలు ఇచ్చిన రైతులకు... వారి వాటాగా ప్రభుత్వం ప్లాట్లు కేటాయించే వరకూ ఈ లావాదేవీలు బాగానే నడిచాయి. తమ వాటాగా వచ్చిన ప్లాట్లను పిల్లల చదువులు, వివాహాల కోసం కొందరు అమ్ముకున్నారు. ఇలా 2019 వరకూ అంతా బాగానే ఉంది. ప్రభుత్వం మారటం, రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు నిలిచిపోగా అక్కడి ప్లాట్ల క్రయవిక్రయాలూ మందగించాయి. ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో 3 రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత అమరావతిలో ఆందోళనలు, ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణకు ముందుకెళ్లటం అన్నీ గత 8 నెలలుగా జరిగిపోయాయి.

భూముల కొనుగోళ్లు, అమ్మకాలతో కళకళలాడిన రాజధాని ప్రాంత రిజిస్ట్రార్ ఆఫీసులు నేడు వెలవెలబోతున్నాయి. అనంతవరంలోని కార్యాలయాన్ని కొద్ది రోజులుగా తెరవడం లేదు. తుళ్లూరు కార్యాలయం తెరిచినా లావాదేవీలు ఉండటం లేదు. భూముల క్రయవిక్రయాలు లేక ఆ కార్యాలయాల్లో పని లేకుండా పోయింది. వాటిని మూసివేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. సీఆర్డీఏ రద్దయితే అక్కడ ఆఫీసులు మూసివేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గుంటూరు రేంజ్ డీఐజీ బాలస్వామి వెల్లడించారు. రాజధాని తరలిస్తే కేవలం అమరావతి ప్రాంతంలోనే కాకుండా జిల్లా మొత్తం రిజిస్ట్రేషన్ల ఆదాయంపై ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజధాని ప్రాంతంలో ఎవరైనా భూములు కొనాలన్నా, అమ్మాలన్నా మళ్లీ గతంలో మాదిరిగా సమీపంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిందే. ఓ వైపు రాజధాని తరలించటం లేదు... ఇది శాసన రాజధాని అని చెబుతూనే ఇక్కడి రిజిస్ట్రార్ కార్యాలయాలు ఎత్తివేయటం సరికాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండీ... సీఆర్డీఏపై హైకోర్టు స్టే వెకేట్​ చేయాలని సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.