ETV Bharat / city

గణనీయంగా తగ్గిన ఆహారధ్యాన్యాల ఉత్పత్తి - food grain production latest news

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్​ సీజన్​లో పంట దిగుబడి తగ్గింది. ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి, వేరుసెనగ దిగుబడులూ అత్యధికంగా తగ్గనున్నట్లు ముందస్తు అంచనాలు చెబుతున్నాయి.

reduced food grain production
తగ్గిన ఆహారధ్యాన్యాల ఉత్పత్తి
author img

By

Published : Apr 6, 2021, 7:33 AM IST

ఖరీఫ్‌ సాగు రైతన్నలకు కలిసి రాలేదు. వరుస వర్షాలు, వరదలతో వారి ఆశలు తల్లకిందులయ్యాయి. 2019-20 ఖరీఫ్‌తో పోలిస్తే 9.56 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గడమే దీనికి నిదర్శనం. నూనెగింజల ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోయింది. 2019-20 ఖరీఫ్‌లో 87.77 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండించగా.. ఈసారి ఖరీఫ్‌లో 78.21 లక్షల టన్నులే వస్తుందని తాజాగా విడుదలైన మూడో ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి. అప్పుడు 80.13 లక్షల టన్నుల ధాన్యం పండించగా ఈ ఏడాది 71.37 లక్షల టన్నులకే పరిమితం కానుంది. రాష్ట్రంలో అత్యధికంగా పండించే వరి, వేరుసెనగ దిగుబడులూ భారీగా పడిపోనున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మినుము దిగుబడీ ఎకరాకు 60 కిలోలు తగ్గింది. కంది దిగుబడి మాత్రం ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కంది దిగుబడి గతేడాది ఖరీఫ్‌లో ఎకరాకు 1.93 కిలోలు లభించగా.. ఈ ఏడాది 1.98 కిలోలకు చేరనుంది. అంటే ఎకరాకు అయిదు కిలోలు అధికంగా వస్తుందని భావిస్తున్నారు.
* గతేడాది ఖరీఫ్‌ వరిలో ఎకరాకు 21 క్వింటాళ్ల దిగుబడి లభించింది. ఈ ఏడాది 16.89 క్వింటాళ్లే వస్తుందని ముందస్తు అంచనాలు పేర్కొన్నాయి. అంటే ఎకరాకు 4.11 క్వింటాళ్ల దిగుబడి తగ్గనుంది. క్వింటాలుకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.1,888 ప్రకారం చూస్తే.. 4.11 క్వింటాళ్లకు రూ.7,759 మేర రైతుల ఆదాయం తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో 42.25 లక్షల ఎకరాల్లో వరి వేశారు. ఈ లెక్కన రూ.3,278 కోట్లు కోల్పోతున్నారు.
* వైరస్‌ తెగుళ్లు, వానల ప్రభావం మిరపపై పడింది. ఉత్పత్తి కూడా 7.30 లక్షల క్వింటాళ్లకు పడిపోనుంది. క్వింటాలుకు రూ.12 వేల లెక్కన వేసుకున్నా.. రైతులకు రూ.876 కోట్ల మేర నష్టం తప్పడం లేదు.
* వేరుసెనగ దిగుబడులూ గతేడాది ఖరీఫ్‌తో పోలిస్తే.. ఎకరాకు 1.50 క్వింటాళ్ల మేర పడిపోయాయి. రాష్ట్రంలో సాగు చేసిన 18.65 లక్షల ఎకరాలకు మద్దతు ధర క్వింటాలుకు రూ.5,275 ప్రకారం రూ.1,476 కోట్ల మేర రైతన్నల ఆదాయం తగ్గింది.
* ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 15.07 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. భారీ వర్షాల నేపథ్యంలో గతేడాది ఖరీఫ్‌తో పోలిస్తే ఈసారి 33.77 లక్షల క్వింటాళ్ల (ఎకరాకు 2 క్వింటాళ్ల) ఉత్పత్తి పడిపోనుంది. క్వింటాలు మద్దతు ధర రూ.5,825 లెక్కన రూ.1,967 కోట్ల మేర రైతులకు ఆదాయం తగ్గినట్లే.

food grain production details
పంట ఉత్పత్తి వివరాలు

ఇదీ చదవండి: విశాఖలో ఈదురు గాలులతో కూడిన వర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.