ETV Bharat / city

POWER CUT: వర్షాకాలంలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు

కొద్దిరోజులుగా భాగ్యనగరంలో ఉక్కపోత అధికమైంది. పగలు, రాత్రి తేడా లేకుండా.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా వేసవిలో ఇలా ఎండలు వస్తే పెద్ద విషయం కాదు కానీ.. వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నగర వాసులు అల్లాడిపోతున్నారు.

author img

By

Published : Aug 12, 2021, 10:50 AM IST

high temperature
అధిక ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ నగరవాసులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో మాదిరి భాగ్యనగరంలో కొద్దిరోజులుగా ఉక్కపోత అధికమైంది. పగలు రాత్రి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జులైలో భారీ నుంచి అతి భారీగా రికార్డు స్థాయిలో వర్షాలు కురవగా.. ఆ తర్వాత సాధారణ వర్షపాతం కూడా కరవైంది. వాతావరణంలో వచ్చిన మార్పులతో కరెంట్‌ వినియోగం వానాకాలంలో ఇదివరకు ఎప్పుడు లేనంత అధికంగా నమోదవుతోంది. ఈ సీజన్‌లో మంగళవారం గరిష్ఠ వినియోగం రికార్డయ్యింది. గతేడాది ఆగస్టు 5 నుంచి 10వ తేదీ మధ్య గరిష్ఠ వినియోగం 44.2 మిలియన్‌ యూనిట్లు ఉంటే.. ఈ ఏడాది అదే కాలంలో గరిష్ఠం 58.78 మిలియన్‌ యూనిట్లపైన కరెంట్‌ వినియోగం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు అధికంగా ఉన్నాయి. పగటిపూట గరిష్ఠంగా 34 డిగ్రీల వరకు, రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.

వేసవి స్థాయిలో..

ఈ ఏడాది వేసవిలో పెద్దగా ఎండలు లేకపోవడం, లాక్‌డౌన్‌ కూడా తోడవడంతో కరెంట్‌ వినియోగమూ పెరగలేదు. వేసవిలో ఒక్కరోజు గరిష్ఠ వినియోగం 60 మిలియన్‌ యూనిట్ల లోపే ఉంది. ప్రస్తుత వానాకాలంలో నగరంలో దాదాపు ఆ స్థాయిలో వినియోగం ఉంది. మంగళవారం రోజు 58.78 మిలియన్‌ యూనిట్ల వరకు నమోదైంది. విద్యుత్తు డిమాండ్‌ వేసవిలో 2800 మెగావాట్లు ఉంటే.. ప్రస్తుతం 2746 మెగావాట్ల వరకు ఉంది. వానలు పడకపోతే ఇది మరింత పెరిగే అవకాశం ఉందని విద్యుత్తు ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు.

పొడిగాలులతోనే వేడి

‘నైరుతి రుతుపవనాల ద్రోణి హిమాలయాలవైపు తరలిపోయింది. దీంతో అక్కడ వర్షాలు పడుతున్నాయి. మన దగ్గరకు పశ్చిమం నుంచి పొడిగాలులు వస్తుండటంతో వేడి ఎక్కువగా ఉంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఏవి లేకపోవడంతో తేమ గాలులు రావడం లేదు. వర్షాలు పడటం లేదు. హైదరాబాద్‌లో 15వ తేదీ వరకు ఇలాగే ఉంటుంది. 16, 17, 18 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.’

- నాగరత్న, సంచాలకులు, హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

ఇదీ చదవండీ.. projects: రాయలసీమ ప్రాంత దాహార్తిని తీర్చేందుకే ఎత్తిపోతల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.