తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా నారసింహుని సన్నిధిలో పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధాన కట్టడాల నిర్మాణాలు దాదాపు పూర్తికావడం వల్ల మిగిలిన పనులను ముమ్మరం చేశారు.
![yadadri reconstructions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-85-02-yadadri-alaya-sannidhi-lo-panulu-av-ts10134_02022021230048_0202f_1612287048_104.jpg)
లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడవీధుల్లో ఫ్లోరింగ్, రథశాల, ఎస్కలేటర్ పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్, డ్రైనేజీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్యూ లైన్ల కోసం స్టీల్ గ్రిల్స్ అమరుస్తున్నారు. పుష్కరిణి పునరుద్ధరణ, మెట్లదారుల నిర్మాణం పనులనూ వేగవంతం చేశారు.
![yadadri reconstructions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-85-02-yadadri-alaya-sannidhi-lo-panulu-av-ts10134_02022021230048_0202f_1612287048_851.jpg)
ఆలయ ప్రాంగణంలోపలి, వెలుపలి.. సాలహారాలలో భగవంతుని విగ్రహ రూపాలకు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. అష్టభుజ మండప ప్రాకారాలపై సాలహారాలు వైష్ణవత్వం ఉట్టిపడేలా దశావతారాలు, నారసింహ రూపాలతో తీర్చిదిద్దే పనులు మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి.
![yadadri reconstructions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-85-02-yadadri-alaya-sannidhi-lo-panulu-av-ts10134_02022021230048_0202f_1612287048_453.jpg)
ఇదీ చూడండి: నువ్వలరేవు.. ఈ గ్రామంలో ఎన్నికలు లేవు!