ETV Bharat / city

Yadadri temple works: మహాకుంభ సంప్రోక్షణకు ఇంకా 140 రోజులే... - యాదాద్రి వార్తలు

తెలంగాణ యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణకు మరో 140 రోజుల గడువున్న దృష్ట్యా... తుది దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి (yadadri temple works). స్వయంభూ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి దర్శించుకున్న తర్వాత... పనుల్లో వేగం పెరిగింది (reconstruction work of the fast progressing). కొండపైన హరిహరుల ఆలయాల పునర్నిర్మాణాలు పూర్తి కావొస్తుండగా... మిగిలిన పనులు కొనసాగుతున్నాయి.

YADADRI
YADADRI
author img

By

Published : Nov 9, 2021, 10:25 AM IST

తెలంగాణ యాదాద్రి శ్రీలక్ష్మీసమేత నారసింహస్వామి నిజరూప దర్శనానికి ముహూర్తం దగ్గర్లో ఉన్నందున... పునర్నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి (reconstruction work of the fast progressing). తుది దశ పనులను వచ్చే ఫిబ్రవరిలోపు పూర్తి చేసేందుకు యాడా దృష్టిసారించింది. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి... ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఉత్తర, తూర్పు దిశల్లో 40 కోట్ల వ్యయంతో చేపట్టిన రక్షణ గోడ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. కైంకర్యాల కోసం విష్ణుపుష్కరిణిని సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లోగా పుష్కరిణి పనులు సంపూర్తి కానున్నాయి. ఆంజనేయస్వామి మందిరానికి దారి నిర్మితమవుతోంది. గండిచెరువు ప్రాంతంలో దీక్షాపరుల మండలం పూర్తయింది. కల్యాణ కట్ట పనులు 5 శాతం మాత్రమే మిగిలి ఉన్నాయి. లక్ష్మీ పుష్కరిణికి సంబంధించి తుది దశ నిర్మాణం జరుగుతోంది. కొండపైన బస్ బే పనులు చకచకా సాగుతుండగా... కొండ కింద పనులు మొదలు కావాల్సి ఉంది.

తుదిదశ పనులు పూర్తి చేసేలా...

కాలినడకన వచ్చే భక్తుల కోసం మెట్ల దారి, ప్రసాదాల తయారీ సరకుల రవాణాకు అండర్ పాస్​ను నిర్మిస్తున్నారు. కొండ కింద వైకుంఠద్వారం నుంచి మెట్ల మార్గం రూపుదిద్దుకుంటోంది. శ్రీ సుదర్శన మహాయాగం నిర్వహణకు గాను స్థల పరిశీలన కోసం చినజీయర్ స్వామితో ముఖ్యమంత్రి రానున్న దృష్ట్యా... తుది దశలో మిగిలిన ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని యాడా నిర్వాహకులు భావిస్తున్నారు.

ఇంకా 140 రోజులే...

మహాకుంభ సంప్రోక్షణకు మరో 140 రోజుల గడువు మిగిలి ఉంది. మార్చి 28, 2022 నాడు మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు... గత నెల 19 నాటి పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అంతకు 8 రోజుల ముందే... మార్చి 21న అంకురార్పణ చేపట్టనున్నారు. 8 రోజులపాటు సాగే మహాసుదర్శన హోమంతో... మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఆ లోపునే పనులు పూర్తి కావాలన్న లక్ష్యంతో భూపాల్ రెడ్డితోపాటు యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు... నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చూడండి:

నేడు ఒడిశా సీఎంతో జగన్‌ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.