ETV Bharat / city

ఉచిత రేషన్ పంపిణీ.. క్యూకట్టిన జనం - ఏపీలో ఉచిత రేషన్ పంపిణీ

తొలిరోజు రేషన్ పంపిణీ ప్రక్రియలో లబ్ధిదారులను సర్వర్ సమస్యలు ఇబ్బందులకు గురిచేశాయి. సరుకులు దొరకవేమోనన్న ఆత్రుత, అధికారుల పర్యవేక్షణ కరవై సామాజిక దూరం స్ఫూర్తిని చాలా చోట్ల గాలికొదిలేశారు. ఒంటిగంట తర్వాత రేషన్ పంపిణీ నిలిపివేతతో.. అప్పటి వరకూ ఎండలో నిలబడిన వారంతా నిరుత్సాహంతో వెనుదిరిగారు. కొన్ని ప్రాంతాల్లో పంపిణీని ప్రజాప్రతినిధులు ప్రారంభించాలన్న నెపంతో వారి రాక కోసం లబ్ధిదారులు చాలాసేపు ఎదురుచూడాల్సి వచ్చింది.

Ration supply started in ap
ఉచిత రేషన్ పంపిణీ.. క్యూకట్టిన జనం
author img

By

Published : Mar 30, 2020, 6:08 AM IST

ఉచిత రేషన్ పంపిణీ.. క్యూకట్టిన జనం

ప్రభుత్వం నిర్ణయం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ ప్రక్రియలో తొలిరోజైన ఆదివారం సాంకేతిక సమస్య లబ్ధిదారుల ఓపికకు పరీక్ష పెట్టింది. సర్వర్ నెమ్మదించి పంపిణీలో ఆలస్యంతో రేషన్ దుకాణాల వద్ద ప్రజలు ఎండలోనే బారులు తీరారు. ఐదారు గంటలు వరుసలో నిలబడితే కానీ సరుకులు అందని పరిస్థితి తలెత్తింది. కరోనా నియంత్రణకు ఉద్దేశించిన లాక్‌డౌన్ నేపథ్యంలో ఉచితంగా కందిపప్పు, బియ్యం పంపిణీలో తొలివిడతను ప్రభుత్వం ఆదివారం ప్రారంభించింది. తొలిరోజే సరుకులు తీసుకునేందుకు...ఆయా ప్రాంతాల్లో లబ్ధిదారులు ఉదయం 5 గంటల నుంచే దుకాణాల వద్ద వరుసల్లో నిలబడ్డారు.

కందిపప్పు కొరత

రాష్ట్రవ్యాప్తంగా కోటీ 47లక్షల తెల్లకార్డులుండగా..తొలిరోజు 17లక్షల 12వేల మంది కార్డుదారులకు రేషన్ పంపిణీ చేశారు. 26 వేల 220 టన్నుల బియ్యం, వెయ్యి 712 టన్నుల కందిపప్పు సరఫరా చేశారు. కొన్ని జిల్లాలకు కందిపప్పు అందలేదు. అనంతపురం జిల్లాలో కొన్ని దుకాణాల్లో... రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభం కాలేదు. కందిపప్పు అందని కారణంగా..ఇవాళ్టి నుంచి పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. నెల్లూరు జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులకు సుమారు 800 కిలోల కందిపప్పు అవసరమైతే 500 టన్నులే సరఫరా చేశారు.

పర్యవేక్షణ లోపం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. కొన్ని చోట్ల గుర్తులు ఏర్పాటు చేసినప్పటికీ.. కొన్నిచోట్ల పర్యవేక్షణ కరవై లబ్ధిదారులు గుంపులుగా ఎగబడ్డారు. ఎక్కువమంది మాస్కులు కూడా ధరించలేదు. బియ్యం, కందిప్పు దొరకవేమో అన్న ఆత్రుతతో తోపులాటలూ జరిగాయి. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత పంపిణీ నిలిపివేయడం వల్ల అప్పటివరకూ ఎండలో నిలబడిన వారంతా నిరుత్సాహంతో వెనుదిరిగారు. కొన్నిప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసిన డీలర్లు... నిర్దేశిత సంఖ్యలో కార్డులు తీసుకుని పరిమితికి మించి ఉన్నవారిని తర్వాతి రోజు రమ్మని ఇళ్లకు పంపేశారు.

ఎండలో అవస్థలు

కొన్ని జిల్లాల్లో రేషన్ పంపిణీని ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో నేతల రాక ఆలస్యంతో... లబ్ధిదారులు ఎండలో అవస్థలు పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి రేషన్ దుకాణం పరిధిలోనూ ఇద్దరు వాలంటీర్లు సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. ఫలితంగా పంపిణీ ఆలస్యం అవుతోంది. అన్ని రేషన్ దుకాణాలకూ పూర్తి స్థాయిలో సరుకులు చేరలేదు.

మూడు విడతల్లో పంపిణీ

ఏప్రిల్ 15న రెండో విడత, 29న మూడో విడతలో రేషన్ పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పంపిణీకి ఎలాంటి కొరతా లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. అందరికీ అందేవరకూ పంపిణీ కొనసాగుతుందన్న ఆయన పాత కార్డులు ఉన్నవారికీ సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి : రేషన్ కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా జనం ఆత్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.