ETV Bharat / city

తెలంగాణ సీఎంపై విరుచుకుపడ్డ రాములమ్మ

కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తే.... తెలంగాణ ముఖ్యమంత్రి దానిని అవహేళన చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో కేసీఆర్ చేతులెత్తేసి... అజ్ఞాతంలోకి జారుకున్నారన్న వార్త రాష్ట్రంలో హాట్ టాపిక్​గా మారిందన్నారు. సంక్షోభ నివారణకు గవర్నర్ చొరవ తీసుకుంటే... దానిని కూడా ఆయన అడ్డుకోవడాన్ని నిరంకుశత్వానికి పరాకాష్టని అభివర్ణించారు.

ramulamma fired on telangana cm
తెలంగాణ సీఎంపై విరుచుకుపడ్డ రాములమ్మ
author img

By

Published : Jul 7, 2020, 8:19 PM IST

తెలంగాణలో ప్రజా తీర్పు తనకు అనుకూలంగా ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పులు మీద తప్పులు చేస్తున్నందున... శిశుపాలుడి తప్పుల్లా రోజురోజుకు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. ప్రజల తిరస్కారానికి గురయ్యే రోజులు దగ్గర పడ్డాయని ఆరోపించారు. ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలు ఇస్తూ మాయమాటలు చెప్పి... తనకు తానే మేధావినని చెప్పుకునే ప్రయత్నం కేసీఆర్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అది నిరంకుశత్వానికి పరాకాష్ట

కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తే.... కేసీఆర్ దానిని అవహేళన చేశారని విజయశాంతి తెలిపారు. కరోనా కట్టడికి తగిన వైద్య సౌకర్యాలు లేవని పత్రికల్లో రాస్తే.. వాటి యాజమాన్యానికి శాపనార్థాలు పెట్టారని ధ్వజమెత్తారు. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని హైకోర్టు తప్పు పట్టినా ఏమాత్రం పట్టించుకోలేదని, చేయి దాటి పోతుందని గ్రహించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా జోక్యం చేసుకున్నారన్నారు. సంక్షోభ నివారణకు గవర్నర్‌ చొరవ తీసుకుంటే... దానిని కూడా కేసీఆర్ అడ్డుకోవడాన్ని నిరంకుశత్వానికి పరాకాష్టని ఆమె అభివర్ణించారు.

అనవసర రాద్ధాంతం వద్దు

సీఎంగా కేసీఆర్‌ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనందున గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేయడం కంటే, సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసా ఇచ్చేట్లు చర్యలు తీసుకోవడం అవసరమని సూచించారు. లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఆగ్రహానికి ఆయన గురికాకతప్పదని విజయశాంతి హెచ్చరించారు.

ఇదీ చదవండి : ఇళ్ల పట్టాల పంపిణీని ఎందుకు అడ్డుకుంటున్నారు..?: జోగి రమేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.