రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి రూ.2,646.84 కోట్లతో మొదటి దశ పనులను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఏపీ మారిటైం బోర్డు జారీ చేసిన టెండరు ప్రకటనకు స్పందించి అరబిందో రియల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్, నవయుగ ఇంజినీరింగ్ కలిసి కన్సార్షియంగా ఏర్పడి బిడ్ వేశాయి. మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) మరో బిడ్ దాఖలు చేసింది. ఇందులో తక్కువ మొత్తం రూ.2,767 కోట్లకు ఒక సంస్థ బిడ్ వేసింది. దీనిపై నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో రూ.2,634 కోట్లకు పనులను అరబిందో, నవయుగ కన్సార్షియం దక్కించుకుంది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.132 కోట్లు ఆదా అయ్యాయని మారిటైం బోర్డు అధికారులు తెలిపారు.
బెర్తుల నిర్మాణం, డ్రెడ్జింగ్ పనులను మొదటి దశలో ప్రతిపాదించారు. వాటికి 2020-21 ప్రామాణిక ధరల ప్రకారం అంచనాలను రూపొందించారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో గుత్తేదారు సంస్థల ఎంపికకు ఏపీ మారిటైం బోర్డు గతేడాది డిసెంబరు 8న టెండరు ప్రకటన జారీ చేసింది. అదే నెల 15లోగా టెండర్ల దాఖలుకు గడువును నిర్దేశించింది. టెండరు ప్రతిపాదనల్లోని కొన్ని సాంకేతిక అంశాలపై గుత్తేదారు సంస్థలకు స్పష్టతనివ్వాల్సి రావటం వల్ల పలుమార్లు గడువు పెంచింది.
ఇదీ చదవండీ... ఎమ్మెల్సీ ఎన్నికలు: ఉపాధ్యాయుల తీర్పు వెల్లడి నేడే