ETV Bharat / city

RGV TWITTER: ఏపీ ప్రభుత్వంపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ దాడి - PERNI NANI

ram-gopal-varma-question-to-minister-perni-nani
ఏపీ ప్రభుత్వంపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ దాడి
author img

By

Published : Jan 4, 2022, 10:17 AM IST

Updated : Jan 4, 2022, 8:11 PM IST

19:56 January 04

సినీపరిశ్రమ నోరు విప్పాలి...

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

10:15 January 04

RGV TWITTER:ఏపీ ప్రభుత్వంపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ దాడి

  • Dear honourable minister of cinematography @perni_nani Sir, I humbly request you or your representatives to answer the following questions sir ..What precisely is the role of government in deciding a market price of any product including films sir ?

    — Ram Gopal Varma (@RGVzoomin) January 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సినిమా టికెట్ల ధరల అంశానికి సంబంధించి దర్శకుడు రాంగోపాల్‌ వర్మ... మంత్రి పేర్ని నానికి ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నలు సంధించారు. సినిమా సహా ఏదైనా ఉత్పత్తికి ధర నిర్ణయంలో ప్రభుత్వ పాత్ర ఎంత అని వర్మ ప్రశ్నించారు. హీరోల రెమ్యూనరేషన్‌ వాళ్ల సినిమాకు పెట్టిన ఖర్చు, రాబడి పైనే ఉంటుందని తేల్చి చెప్పారు. ఖర్చు, రాబడి విషయాన్ని ఏపీ మంత్రుల బృందం అర్థం చేసుకోవాలన్నారు. నిత్యావసర వస్తువుల కొరత ఉన్నప్పుడు ప్రభుత్వ జోక్యం అర్థం చేసుకున్నానన్న ఆర్జీవీ.. సర్కార్‌ జోక్యంతో సమతుల్యత కంటే దిగువన లేదా ఎక్కువ ధర నిర్ణయిస్తారన్నారు. అదే రీతిలో సినిమాలకు ఎలా వర్తింపజేస్తారని ఆర్జీవీ ప్రశ్నించారు.

ఆహార ధాన్యాల్లోనూ బలవంతంగా ధర తగ్గిస్తే రైతులు ప్రోత్సాహాన్ని కోల్పోతారన్న వర్మ....ప్రోత్సాహం కోల్పోతే నాణ్యత లోపాన్ని సృష్టిస్తుందన్నారు. అదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికి కూడా వర్తిస్తుందని వర్మ తేల్చిచెప్పారు. పేదలకు సినిమా చాలా అవసరమని ప్రభుత్వానికి అనిపిస్తే రాయితీ ఇవ్వొచ్చు కదా? అని వర్మ ప్రశ్నించారు. ప్రభుత్వ జేబులోంచి వైద్య, విద్యా సేవలకు రాయితీలు ఇస్తున్నారన్న వర్మ అదే రీతిలో సినిమాలకు కూడా ప్రభుత్వం ఎందుకు సబ్సిడీ ఇవ్వదని నిలదీశారు. పేదలకు బియ్యం, పంచదార అందించడానికి రేషన్ షాపులు సృష్టించినట్లే.. రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచిస్తారా? అని ప్రశ్నించారు.

ద్వంద్వ ధరల విధానంలో పరిష్కారం ఉంటుందన్న ఆర్జీవీ.. నిర్మాతలు వారి ధరకు టిక్కెట్లను విక్రయించవచ్చు అన్నారు. ప్రభుత్వం కొన్ని టిక్కెట్లు కొని పేదలకు తక్కువ ధరకు అమ్మవచ్చని సూచించారు. అలా చేస్తే మేము మా డబ్బును పొందుతాం.. మీరు మీ ఓట్లు పొందవచ్చు అంటూ ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. ప్రభుత్వానికి ప్రజలను ఆదుకునే అధికారం ఇచ్చారన్న ఆర్జీవీ.. తమ తలపై కూర్చోవడానికి కాదని అర్థం చేసుకోవాలన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని మంత్రి పేర్ని నానిని దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కోరారు.

సినీపరిశ్రమ నోరు విప్పాలి...

సినిమా టిక్కెట్ ధరల తగ్గింపుపై సినీపరిశ్రమ నోరు విప్పాలంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇప్పుడు నోరు తెరవకపోతే ఎప్పటికీ తెరవలేరని తెలిపారు. ఇది తన విన్నపం కాదని డిమాండ్ అని రాంగోపాల్‌ వర్మ వివరించారు.

రూల్స్‌ పాటించాల్సిందే: పేర్నినాని

ఏదైనా సినిమాని ఓటీటీలో విడుదల చేస్తే ప్రభుత్వానికి సంబంధం ఉండదని, థియేటర్లలో విడుదల చేస్తే రూల్స్‌ పాటించాల్సిందేనని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఓ ఛానల్‌ వేదికగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ)తో ఆయన ఫోన్లో సంభాషించారు. సినిమా టికెట్‌ ధరల విషయమై మరోసారి స్పందించారు. ఆర్జీవీ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

మంత్రి అనే విషయాన్ని పక్కనపెడితే తానూ ఓ సినిమా అభిమానినని అన్నారు. సినిమాటోగ్రఫీ చట్టం ఎప్పటి నుంచో అమల్లో ఉందని, తానూ, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కొత్తగా పెట్టింది కాదన్నారు. సినిమా టికెట్‌ ధరల విషయంలో గత ప్రభుత్వాలూ కోర్టును ఆశ్రయించాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏప్రిల్‌లో జారీ చేసిన జీవోను ఓ న్యాయమూర్తి సమర్థించారని, ఇటీవల మరో జడ్జి దానిలో కొన్ని మార్పులు చేయాలన్నారని తెలిపారు. ఏదైనా సినిమాని శాటిలైట్‌, ఓటీటీకి అమ్మినపుడు ప్రభుత్వంతో సంబంధం ఉండదన్నారు. థియేటర్లలో విడుదల చేసినపుడు రూల్స్‌ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వానికి సంబంధం లేకపోతే జాయింట్‌ కలెక్టర్‌ను సంప్రదించాలని న్యాయమూర్తి ఎందుకు తీర్పు ఇస్తారని ప్రశ్నించారు.

ఇదీ చూడండి:

MANYAM TEMPARATURE: మన్యంలో పెరిగిన చలి తీవ్రత.. వణుకుతున్న ప్రజలు

Last Updated : Jan 4, 2022, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.