ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ ముగిసింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వైకాపా నుంచి నలుగురు, తెదేపా నుంచి ఒకరు పోటీలో ఉన్నారు. నామినేషన్ ఉపసంహరణకు ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉండటంతో.. ఆ సమయం ముగిసిన తర్వాతే ఎన్నికల నిర్వహణపై తదుపరి ప్రకటన చేస్తామని రిటర్నింగ్ అధికారి పి.బాలకృష్ణమాచార్యులు ప్రకటించారు.
ఇదీ చదవండి : రాజ్యసభకు నలుగురు వైకాపా అభ్యర్థుల నామినేషన్లు