సీఎంను కలిసిన మంత్రి మోపీదేవి, అయోధ్యరామిరెడ్డి - సీఎంను కలిసిన మంత్రి మోపీదేవి, అయోధ్యరామిరెడ్డి
రాజ్యసభకు ఎంపిక చేసినందుకు మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలిసిన అయోధ్యరామిరెడ్డి రేపు నామినేషన్లు వేయనున్నట్లు తెలిపారు. మేక్ఇన్ ఆంధ్రా, స్మార్ట్ ఆంధ్రా, స్వచ్ఛ ఆంధ్రా తమ ముందున్న లక్ష్యమని అయోధ్యరామిరెడ్డి తెలిపారు. రాజ్యసభకు బీసీల ప్రాతినిధ్యం పెరిగిందని మంత్రి మోపీదేవి వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు.