శాసన, న్యాయ, కార్యనిర్వాహక రాజధానులను 3 ప్రాంతాల్లో... ఏర్పాటు చేయొచ్చనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో... అమరావతి అన్నదాతలు ఉద్యమ బాటపట్టారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగానే అమరావతిని అభివృద్ధి చేయాలని... రాజధానికి భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులు రోడ్డెక్కారు.
బంద్ ద్వారా తమ నిరసన వ్యక్తం చేసిన రైతులు... ఆందోళన ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. రాజధాని రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ భవిష్యత్ ప్రణాళికను ప్రకటించింది. తుళ్లూరులో వంటావార్పు, మందడంలో మహాధర్నా, వెలగపూడిలో నిరాహారదీక్షలు కొనసాగించాలని నిర్ణయించింది. వైకాపా ప్రభుత్వం... 3 రాజధానుల ప్రతిపాదన విరమించుకునే వరకూ వెనక్కి తగ్గేదేలేదని అమరావతి ప్రాంత రైతులు తేల్చి చెప్తున్నారు.
రాజధానిలో అసైన్డ్ భూముల విక్రయాలపై... ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదని కొందరు రైతులు అభిప్రాయపడుతున్నారు. అన్నదాతల మధ్య చిచ్చుపెట్టడం సరికాదని సూచిస్తున్నారు. అమరావతిలోనే పరిపాలనా రాజధాని కొనసాగించాలనే నినాదాన్ని... రాజధాని పరిధిలోని గ్రామగ్రామానికీ తీసుకెళ్లేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.
ఇదీ చదవండీ...