ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో చేసిన రాజధాని వికేంద్రీకరణ ప్రకటనకు నిరసనగా... అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో బంద్ ప్రారంభమైంది. తుళ్లూరు వద్ద రాజధాని రైతులు రాస్తారోకో నిర్వహించారు. సచివాలయానికి వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. పలు చోట్ల రోడ్లకు అడ్డంగా వాహనాలు అడ్డుపెట్టారు. తుళ్లూరు వద్ద రోడ్డుపైనే వివిధ పాఠశాలల బస్సులు నిలిచిపోయాయి. కొన్ని పాఠశాలలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసేశారు. ప్రభుత్వం తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: