ETV Bharat / city

రైతన్నలకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా రైతు భోగి కార్యక్రమం - చిత్తూరు జిల్లాలో తెదేపా రైతు భోగి నిరసన

పలు విపత్తులతో నష్టపోయిన రైతన్నలకు బాసటగా నిలుస్తూ..రాష్ట్రవ్యాప్తంగా తెదేపా రైతు భోగి కార్యక్రమాన్ని నిర్వహించింది. అన్నదాతలకు వ్యతిరేకంగా ఉన్న జీవోల ప్రతులను భోగిమంటల్లో వేశారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా నేతలు నినాదాలు చేశారు.

raithu bhogi program  in the state
రైతన్నలకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా రైతు భోగి కార్యక్రమం
author img

By

Published : Jan 13, 2021, 3:16 PM IST

శ్రీకాకుళం జిల్లాలో..

రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలకు ప్రతీకగా ఈఏడాది తెదేపా రైతు భోగిగా జరుపుకుంటోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆయన సృగామమైన నిమ్మాడలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలిసి భోగిని జరుపుకొన్నారు.

రైతులు పడుతున్న ఇబ్బందులు మీద.. ప్రభుత్వం ఒక్క నిర్ణయం తీసుకోలేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అన్నదాతలపై తీసుకున్న నిర్ణయాల వలన 11 వందల రైతు ఆత్మహత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వలేదని మండిపడ్డారు. శ్రీకాకుళంలో వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు మీటర్లు అమర్చడానికి తీసుకొచ్చిన జీవో ప్రతిని భోగి మంటల్లో వేసి..నిరసనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

విశాఖ జిల్లాలో..

సంక్రాంతి సంబరాల కార్యక్రమాల్లో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నంలో పలువురు భక్తులు భోగి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన కూడళ్లలో భోగి మంటలు వేసి చలి మంటలను ఆస్వాదించారు. తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కుటుంబ సభ్యులతో ఇంటికి సమీపంలో ఉన్న మరిడమ్మ ఆలయ ప్రాంగణంలో భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న సతీమణి పద్మావతి కుమారుడు రాజేష్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లాలో...

వచ్చే సంక్రాంతికి దుర్మార్గపు పాలన అంతం కావాలని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫేక్ ముఖ్యమంత్రిగా జగన్ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారని దుయ్యబట్టారు.

విజయవాడలో...

విజయవాడ తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్‌ ఆధ్వర్యంలో భోగి సంబరాలు నిర్వహించారు. రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తెచ్చిన ఉత్తర్వులంటూ వాటి ప్రతులను భోగి మంటల్లో వేశారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై తెదేపా పోరాడుతోందని గద్దె రామ్మోహన్‌ స్పష్టంచేశారు.

గుంటూరు జిల్లాలో

వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా... గుంటూరులో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. గుంటూరు తెదేపా జిల్లా కార్యాలయం ఎదుట భోగి మంటలు వెలిగించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవోలను భోగిమంటల్లో వేశారు. పాడిపంటలతో సందడిగా చేసుకోవాల్సిన సంక్రాంతి పండగ.. వైకాపా మూర్ఖపు నిర్ణయాలతో నిరాశగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు అన్నారు.వైకాపా ప్రభుత్వం అన్నదాతలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని.. రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను భోగిమంటల్లో వేసినట్లు అయన చెప్పారు. నిరసన కార్యక్రమంలో నక్కా ఆనంద్ బాబు, రాయపాటి రంగబాబు, చిట్టిబాబు, శ్రీనివాసరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

వల్లభరావుపాలెం

సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పబ్లిసిటీపై ఉన్న ధ్యాస రైతుల కష్టాలు తీర్చడంలో లేదని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో వైకాపా ప్రభుత్వ ప్రవేశ పెట్టిన జీవో కాపీలను పొన్నూరు రూరల్ మండలం వల్లభరావుపాలెం గ్రామంలో భోగి మంటలలో వేసి నిరసన తెలియజేశారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

చిత్తూరు జిల్లా

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో చంద్రబాబు ఇంటి ముందు టీఎస్ఎన్​వీ మండలాధ్యక్షుడు రాకేష్ చౌదరి ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన జీవో పేపర్లను భోగి మంటలలో వేశారు. సంక్రాంతి భోగి మంటలతో ప్రారంభం కావాల్సి ఉండగా రైతుల గుండె మంటలతో భోగి పండుగను రాష్ట్ర ప్రజలు నిర్వహించుకుంటున్నారన్నారు. అధికారం చేపట్టిన 19 నెలలు రైతులకు నష్టం చేకూర్చే 5 జీవోలను తీసుకు వచ్చిందని మండిపడ్డారు. వైయస్ పుట్టిన రోజు పేరుతో వ్యవసాయశాఖ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 417 ,వ్యవసాయ పంపుసెట్లుకు విద్యుత్ మీటర్ల జీవో 22 ను తీసుకురావడం దారుణమన్నారు.

అనంతపురం జిల్లాలో..

అన్నదాత పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అడుగడుగునా రైతులకు తీరని అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు నివాసం వద్ద భోగిమంటల్లో ప్రభుత్వ రైతు వ్యతిరేక ఉత్తర్వుల ప్రతులను దహనం చేశారు. రైతులకు హక్కుగా రావాల్సిన సహాయాలను అందించకుండా ఆశలు పెంచి వ్యవసాయరంగాన్ని పాతాళానికి తొక్కేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఇంత దుర్మార్గమైన రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా రైతులకు 2018 కి సంబంధించి 931 కోట్ల రూపాయల ఇన్​పుట్​ సబ్సిడీ ఏడాదిన్నర కాలంగా అందించకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఖరీఫ్​కు సంబంధించి కేవలం 360 కోట్ల క్రాప్ ఇన్సూరెన్స్ అందించి మిగిలిన రైతులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు.

రైతులకు గిట్టుబాటు ధర లభించక సగానికి సగం ధరలకు పంటలు అమ్ముకుని నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతులకు ఇంత పెద్ద ఎత్తులో మోసం దగా జరిగిన పరిస్థితి చరిత్రలో ఎన్నడూ లేదని పేర్కొన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం రైతుకు తీరని ద్రోహం చేయడమేనని పేర్కొన్నారు

అనంతపురంలో

వైకాపా ప్రభుత్వం రైతుల పట్ల ప్రేమ లేకుండా మొసలికన్నీరు కారుస్తూ ప్రజలను మభ్యపెడుతోందని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. సంక్రాంతి సందర్భంగా అనంతపురంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం జీవోలను భోగిమంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాజకీయ వ్యవహారాల అన్నిటినీ వ్యాపారాలుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలో తెదేపాని మరింత బలోపేతం చేయడానికి విద్యావంతులైన చురుకైన కార్యకర్తలను ఎన్నుకోవడానికి ఈనెల 16వ తేదీన కమ్మ భవన్ లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గుంతకల్లులో

అనంతపురం జిల్లా గుంతకల్లులోని పొట్టి శ్రీరాములు కూడలిలో చంద్రబాబు ఆదేశాల మేరకు తెదేపా, సీపీఐ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య మానవులపై అధిక పన్నులు, నిత్యావసర ధరలు పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నారన్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అన్నారు. కేంద్రం తాజాగా ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేకమైన నల్ల చట్టాలను వెంటనే ఉప సంహరించుకోవాలన్నారు. ఇలాంటి చట్టాల వల్ల రైతులకు నష్టం చేకూరుతుందని అన్నారు.

కల్యాణదుర్గంలో..

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు స్వస్తి పలికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ ముందు భోగిమంటల్లో ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన జీవో కాపీలను భోగిమంటల్లో తెదేపా కార్యకర్తలు తగలబెట్టారు. రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చని జీవోలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొవాలని డిమాండ్ చేశారు. రైతు శ్రేయస్సు కోసం పనిచేసి రాష్ట్రంలో అన్ని విధాలా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.

కర్నూలు జిల్లాలో

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. రైతులు అధిక వర్షాలకు తీవ్రంగా నష్టపోయారని, గిట్టుబాటు ధర లేక దిగుబడులను రోడ్లపై వేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రైతన్నలకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా రైతు భోగి కార్యక్రమం

ఇదీ చూడండి. భోగి మంటల్లో రైతు వ్యతిరేక జీవోలు.. చంద్రబాబు నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.