ఉత్తర బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఈ నెల 28న అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందని వాతావరణ శాఖ సంచాలకురాలు స్టెల్లా వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలో ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు.
ఇదీ చదవండి:
Floods Effect on Devipatnam: జలదిగ్బంధంలో దేవీపట్నం.. ప్రభుత్వ తీరుపై పోలవరం నిర్వాసితుల ఆగ్రహం