నైరుతీ బంగాళాఖాతంలో.. ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఉభయగోదావరి, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకూ వర్ష సూచన ఉందని అంచనా వేసింది. మరోవైపు.. ఉత్తర, పశ్చిమ భారత్ నుంచి వీస్తున్న శీతగాలులతో.. సాధారణం కంటే 3 డిగ్రీల మేర తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్టు.. వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదీ చదవండి: Sankranti Protest: సమర సంక్రాంతి నిరసన.. ఆకుపచ్చ బెలూన్లు ఎగరవేసిన రాజధాని రైతులు