ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా మరో 5 గంటల్లో వర్షాలు - ఏపీకి భారీ వర్ష సూచన

ఏపీలో మరో 5 గంటల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Rains in another 5 hours across the state
రాష్ట్రవ్యాప్తంగా మరో 5 గంటల్లో వర్షాలు
author img

By

Published : Oct 20, 2020, 10:01 AM IST

రాష్ట్రవ్యాప్తంగా మరో 5 గంటల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు అన్నారు. విశాఖ, గోదావరి జిల్లాలతోపాటు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని.... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు సూచించారు.

ఇదీ చదవండి:

పోలవరం అంచనాలపై కొత్త కొర్రీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.