రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో పలు చోట్ల తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. విజయవాడ, నూజివీడులో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మైలవరంలోని దేవుని చెరువు ప్రాంతంలో నివాసాల మధ్య వర్షపు నీరు చేరింది. జి.కొండూరు, పెనుగంచిప్రోలు మండలాల్లో కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రకాశం జిల్లా దర్శిలో గత రెండు రోజులుగా ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు పొలం పనులలో నిమగ్నమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కేశవరంలోని 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో గనిపోతు రాజు ఆలయం సమీపంలోని చెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కోనసీమలో ఉదయం 6 గంటల నుంచి ఏకదాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి .
ఇదీ చదవండి: