ETV Bharat / city

"సికింద్రాబాద్​లో రైళ్ల విధ్వంసం.. స్కెచ్ వారిదే" - రైలుకు నిప్పు

rail
rail
author img

By

Published : Jun 19, 2022, 8:54 PM IST

Updated : Jun 19, 2022, 9:56 PM IST

20:48 June 19

వివరాలు వెల్లడించిన రైల్వే పోలీసులు

SEC Railway station rampage: "అగ్నిపథ్‌"కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ పక్కా ప్రణాళిక ప్రకారమే రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేశారని ఎస్పీ అనురాధ వెల్లడించారు. దాడుల్లో పాల్గొన్న 46 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. యువకులపై రైల్వే కేసులు నమోదైతే ఉద్యోగాలకు అనర్హులవుతారని ఆమె స్పష్టం చేశారు. సికింద్రాబాద్​లో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్ ఆందోళనలో పాల్గొన్న వారంతా ఆర్మీ దేహధారుడ్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని ఎస్పీ వెల్లడించారు. ఆర్మీ అభ్యర్థులను కొన్ని శిక్షణ కేంద్రాలు తప్పుదారి పట్టించాయని పేర్కొన్నారు. ఈ నెల 16న వాట్సప్‌ గ్రూప్‌లు రూపొందించుకుని కుట్ర చేశారని తెలిపారు. రైల్వే ఆస్తులు ధ్వంసం చేయాలని ప్రణాళిక రచించుకున్నారన్నారు.

సికింద్రాబాద్‌ స్టేషన్‌పై దాడిని ఊహించలేదని.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని ఎస్పీ అనురాధ స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్‌లో ఆయిల్‌, ఇంజిన్లకు మంటలంటుకుంటే భారీ విధ్వంసం జరిగి ఉండేదని వెల్లడించారు. భారీ ప్రమాదాన్ని నివారించడానికే కాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రైల్వే రక్షక దళం పోలీసులు 20 రౌండ్ల కాల్పులు జరిపారని అనురాధ తెలిపారు.

ఇది సర్​ప్రైజ్​ అటాక్. అందరూ కూడా ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్నావారే. సికింద్రాబాద్‌ అల్లర్లలో మొత్తం 58 బోగీలు ధ్వంసం అయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆందోళనకారులపై కాల్పులు జరిపాం. ఆందోళనకారులపై పలు సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదు చేశాం. కేసులు నమోదైన వారికి భవిష్యత్‌ ఉద్యోగాలు రావు.

-అనురాధ, రైల్వే ఎస్పీ

ఉదయం 8.56 గంటలకు గేట్ నంబర్ 3నుంచి మొదట 300 మంది స్టేషన్ వద్దకు వచ్చారని తెలిపారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ వాళ్లు కట్టడి చేయడానికి ప్రయత్నించారు. అక్కడ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న రైళ్లపై రాళ్లు రువ్వి.. కొన్ని రైళ్లకు నిప్పు పెట్టారని వెల్లడించారు. బయటి నుంచి ఫోర్స్ మీద కూడా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. కేంద్ర ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేస్తే జీవిత ఖైదు పడుతుందన్నారు. పక్క సమాచారంతో ఆందోళనకారులు దాడులు చేశారని.. 16 ఆందోళకారులు, 9 మంది పోలీసులకు గాయాలైనట్లు ఆమె తెలిపారు. చనిపోయిన వ్యక్తికి బులెట్ గాయం అయిందని.. దర్యాప్తులో మరికొంత మంది అరెస్ట్ అయ్యే అవకాశముందని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసును హైదరాబాద్ పోలీసులకు బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Last Updated : Jun 19, 2022, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.