South central railway Tickets vending facility : అన్‌రిజర్వుడు, ప్లాట్‌ఫాం టికెట్ల కొనుగోలుకు ప్రస్తుతం పలు రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్న ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్ల(ఏటీవీఎం)లో... క్యూఆర్(క్విక్ రెస్పాన్స్) కోడ్‌తో డబ్బులు చెల్లించే సౌకర్యాన్ని దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ సెల్‌ఫోన్‌లోని పేటీఎం లేక ఫ్రీఛార్జి యాప్‌ల ద్వారా ఏటీవీఎంలోని క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి డబ్బు చెల్లించి టికెట్ పొందవచ్చని జోన్ సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు.
ప్రస్తుతం ఈ మెషిన్ల ద్వారా టికెట్లు తీసుకోవాలంటే స్మార్ట్ కార్డు ఉండాలి. స్టేషన్లలో జనరల్ బుకింగ్ లేదా ఆన్‌లైన్‌లో ఈ కార్డులను రీఛార్జి చేసుకోవాల్సి వచ్చేది. క్యూఆర్ కోడ్ విధానంతో టికెట్ల కొనుగోలు సులభతరం అవుతుందని, ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ద.మ.రైల్వే ఇన్‌ఛార్జి జనరల్ మేనేజర్ సంజీవ్‌కిశోర్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఆటో.. ఎడ్ల బండిగా మారింది... అదెలా అనుకుంటున్నారా..?