బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు రామోజీ ఫిల్మ్‌సిటీలో సందడి చేసింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో హైదరాబాద్ హంటర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సింధు... తన జట్టు సభ్యులతో కలిసి వచ్చింది. ఫిల్మ్‌సిటీ పర్యటనలో... సింధు మొదట ఈటీవీ భారత్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. 13 భాషల్లో వార్తలు అందిస్తున్న తీరును ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి ఆమెకు వివరించారు. అనంతరం సింధు ఈనాడు డెస్కుకు వెళ్లి వసుంధర విభాగంలో పనితీరు గమనించింది. సిబ్బందితో ముచ్చటించింది. వసుంధర పేజీని నిత్యం చదువుతానని సింధు వెల్లడించింది. రామోజీ గ్రూపు సంస్థల కార్పొరేట్ భవనంలో అధినేత రామోజీరావును సింధు కలిసింది. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన ఆమెను... రామోజీరావు, ఈనాడు ఎండీ కిరణ్ అభినందించారు.
ఇవీ చూడండి-ఐక్యూతో చంద్రబాబును ఆశ్చర్యపరిచిన బుడతడు