ETV Bharat / city

Dr. Gagandeep Kang on Booster Dose: బూస్టర్​ డోసుతో 85 శాతం రక్షణ - Covid booster dose

Dr Gagandeep Kang on Booster Dose: దేశంలో ఇప్పటికే కొవిడ్‌ మూడో దశ ప్రారంభమైంది. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారానికి గరిష్ఠ స్థాయిలో ఒమిక్రాన్‌ కేసులు నమోదవుతాయి. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ వైరాలజిస్టు, వెల్లూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజి (సీఎంసీ) ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ల ప్రభావంపై భారతదేశంలో అధ్యయనం జరగకపోయినా, ఇతర దేశాల్లో జరిగిన దాని ప్రకారం బూస్టర్‌డోసు వల్ల 85 శాతం రక్షణ ఉంటుందని తెలిపారు. రెండు వ్యాక్సిన్లు, బూస్టర్‌డోసు వేసుకొన్న వారిని గమనించడంతో పాటు అధ్యయనం చేయాల్సిన అవసరముందని 'ఈనాడు- ఈటీవీ భారత్​'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు.

Dr Gagandeep Kang
Dr Gagandeep Kang
author img

By

Published : Jan 13, 2022, 7:55 AM IST

* కొవిడ్‌ నుంచి రానున్న రోజుల్లో ఎదురయ్యే ప్రధాన సవాళ్లు ఏంటి?

ఈ ఏడాదంతా ఏం జరుగుతుందో అంచనా వేయడం ప్రస్తుతం కష్టం. కేసుల పరంగా చూస్తే మనం మూడోవేవ్‌లో ఉన్నాం. గతంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వచ్చిన కేసుల సంఖ్య కన్నా చాలా ఎక్కువగా వస్తున్నాయి. జనాభా, వ్యాక్సినేషన్‌పైన దీని ప్రభావం ఆధారపడి ఉంది. రెండు నుంచి నాలుగు వారాల్లో ఒమిక్రాన్‌తో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. జనవరి ఆఖరులో లేదా ఫిబ్రవరి ఆరంభంలో గరిష్ఠ సంఖ్యలో కేసులు నమోదవుతాయని నమూనాలు (మోడల్స్‌) అంచనా వేస్తున్నాయి.

* ఒమిక్రాన్‌కు దారితీసిన పరిస్థితులేంటి? ఇది ఎంత ప్రమాదకరమైంది?

ఒమిక్రాన్‌ ఎలా వచ్చిందన్నదానిపై పలు సిద్ధాంతాలున్నాయి. ప్రపంచంలో పర్యవేక్షణ, నిఘా చాలా తక్కువగా ఉన్నచోట్ల వైరస్‌ విస్తరించి ఒమిక్రాన్‌కు దారి తీసింది. మెరుగైన ప్రయోగశాలలు ఉన్నా దక్షిణాఫ్రికాలో దీనిని చూసే వరకు గుర్తించలేకపోయాం. రెండోది వైరస్‌ మనుషుల నుంచి జంతువులకు వెళ్లిన చోట ఏర్పడి తిరిగి (రివర్స్‌ జూనోసిస్‌) మనుషుల్లోకి వచ్చింది. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వ్యక్తికి వైరస్‌ సోకి తదుపరి విస్తరించేవరకు మ్యుటేషన్‌ జరిగిందనేది ఇంకొకటి.. ఇలా మూడు కారణాలున్నాయి. ఒమిక్రాన్‌ను నిరోధించడానికి ఇదివరకటి జాగ్రత్తలే మళ్లీ పాటించాలి.

ప్రజలంతా వ్యాక్సిన్‌ వేసుకొనేలా చూడటం..డేటాపైన, ఇందుకు సంబంధించిన వ్యవస్థలపైన పెట్టుబడులు పెట్టడం.. అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడం, వారితో డేటా పంచుకోవడం.. రోగ నిర్థారణ కేంద్రాలు, మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడటం ప్రధానం. మాస్కులు పెట్టుకోవడం, ఎక్కువ మంది గుమిగూడకుండా చూడటం, వ్యాక్సిన్లు తీసుకోనివారంతా తీసుకోవడంతో పాటు మాస్కులను అప్‌గ్రేడ్‌ చేయడం గురించి కూడా ఆలోచించాలి. తక్కువ రిస్క్‌ ఉన్న చోట గుడ్డ మాస్కులు కాకుండా సర్జికల్‌ మాస్కులు, ఎక్కువ రిస్కు ఉన్న చోట ఎన్‌-95 మాస్కులు వినియోగించాలి.

* కొన్ని అధ్యయనాల ప్రకారం ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తుంది కానీ , దీని బారిన పడిన వారు ఎక్కువ ప్రమాదంలోకి వెళ్లరని అంటున్నారు. ఇది మంచి సంకేతంగా భావించవచ్చా?

ఇది వాస్తవమే అయినా ఎక్కువమందికి సోకినప్పుడు ఆసుపత్రిలో చేరేవారి సంఖ్యా పెరుగుతుంది. ఉదాహరణకు ఒక వైరస్‌ రోజుకు వెయ్యి ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుందనుకొంటే, ఇందులో పదిశాతం మంది ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రావొచ్చు. అంటే రోజుకు 100 మందికి ఆసుపత్రి అవసరమవుతుంది. అయితే ఇంకో వైరస్‌ రోజుకు ఐదువేల ఇన్‌ఫెక్షన్లకు కారణమైతే ఐదు శాతం మందికే ఆసుపత్రి అవసరమవుతుంది. కానీ సంఖ్యాపరంగా చూసినపుడు ఇది 250. ఈ సంఖ్యే ఎక్కువ. ఒమిక్రాన్‌ కూడా ఇంతే.

* కేంద్రం బూస్టర్‌డోస్‌కు అనుమతించింది. మూడోడోస్‌గా ఏ వ్యాక్సిన్‌ తీసుకోవాలి? బూస్టర్‌డోస్‌ ఒమిక్రాన్‌ నుంచి రక్షణ ఇస్తుందా?

ప్రస్తుతానికి గతంలో తీసుకున్న టీకానే బూస్టర్‌డోస్‌గా తీసుకోవాలని కేంద్రం సూచించింది.కానీ ప్రపంచంలోని ఇతర దేశాల డేటా ప్రకారం వేర్వేరు వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. భారతదేశం నుంచి కూడా త్వరలోనే డేటా వస్తుందని, వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకునే విషయాన్ని పరిగణనలోకి తీసుకొంటారని ఆశిస్తున్నా. ఇతర దేశాల్లోని డేటా ప్రకారం బూస్టర్ల వల్ల ఒమిక్రాన్‌ నుంచి మెరుగైన రక్షణ ఉందని చెప్తున్నాయి.

* వ్యాక్సినేషన్‌ తీసుకున్నా లేదా కొవిడ్‌ బారినపడిన వారికి ఒమిక్రాన్‌ నుంచి రక్షణ ఉంటుందా?

వ్యాక్సిన్లు ఎలా పని చేశాయి? వాటి సామర్థ్యం ఎంత? అన్నదానిపై మన దగ్గర డేటా లేదు.భారతదేశంలో ఈ సమాచారం లేకపోయినా యు.కె.లో జరిగిన అధ్యయనం ప్రకారం రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకొన్నవారికి ఆసుపత్రి అవసరం లేకుండా 70 శాతం రక్షణ ఆరునెలల పాటు ఉంటుంది. తర్వాత 55 శాతానికి పడిపోతుంది. అయితే బూస్టర్‌ డోసు వల్ల రక్షణ 85 శాతానికి పెరుగుతుంది.

* ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రజలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

ఎవరికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందో, బలహీనులెవరో గుర్తించి వారికి వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపర్చాలి. ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేకుండా చూడాలి. చేరాల్సి వచ్చినా మెరుగైన వైద్యం అందేలా చూడటం మఖ్యం. ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవాలి. తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలి. అనారోగ్యంగా అనిపిస్తే ఇతరుల వద్దకు వెళ్లొద్దు.

భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన వేరియంట్‌ వచ్చే అవకాశం ఉందా?

చ్చితంగా ఉంది. దీని నుంచి బయటపడటానికి, నివారించడానికి మెరుగైన మార్గం ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడమే. దీనివల్ల వైరస్‌ లోడు తగ్గుతుంది. దీంతోపాటు కొత్త వేరియంట్స్‌ ఏం వస్తున్నాయన్నదానిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి.

ఒమిక్రాన్‌ పెద్దలకంటే పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందా?

సుపత్రుల్లో చేరే పిల్లల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మొదట దక్షిణాఫ్రికాలో, తర్వాత ఉత్తర అమెరికా, యు.కె.లో పిల్లలపై ప్రభావం కనిపించింది. ఇది ఎందుకు జరిగిందన్నదానిపై స్పష్టత లేదు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా ఎగువ శ్వాసకోశ సంక్రమణ జరిగి చిన్న పిల్లల్లో వాపు, నొప్పితోపాటు ఊపిరి పీల్చుకోవడం కష్టమయ్యే పరిస్థితి ఉంది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగినా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా పిల్లల్లో పరిస్థితి తీవ్రంగా మారడం కానీ, మరణాల్లో కానీ గతంలో కంటే మార్పు ఉండే అవకాశం లేదు.

ఇవీ చూడండి:

'5 నిమిషాల్లో సంక్రమణ సామర్థ్యాన్ని కోల్పోతున్న కరోనా!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.