తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా నియమితులైన ప్రొఫెసర్ లింబాద్రి(Professor Limbadri) మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌గా కొనసాగిన పాపిరెడ్డి పదవీ కాలం ముగియడంతో లింబాద్రికి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం లింబాద్రి ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌గా నియమించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు(cm kcr) ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఉన్నత విద్య పరంగా అనేక ఇబ్బందులు తలెత్తాయని... ఉద్యోగుల కృషితో వాటిని జయించినట్లు మాజీ ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి: Peddireddy: 'ప్రభుత్వ ఆదాయానికి ఆ వనరులు కీలకం.. సద్వినియోగం చేసుకోండి'