ETV Bharat / city

SCHOOLS: బడికి వెళ్లాలంటే.. కష్టమన్నా పట్టించుకోవడం లేదు

author img

By

Published : Jul 11, 2022, 8:36 AM IST

Schools: పాఠశాలల విలీనంతో ప్రాథమిక విద్యావ్యవస్థ విచ్ఛిన్నమవుతోంది. కరికులమ్‌, బోధన, అభ్యసన విధానాల కోసం తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానంలో మార్పును ఇప్పుడు భౌతికంగా అమలుచేస్తున్నారు. అంగన్‌వాడీలు, ఒకటి, రెండు తరగతులు కలిపి ఉండే ఫౌండేషన్‌ పాఠశాలల పర్యవేక్షణలో అనేక ఇబ్బందులు ఏర్పడనున్నాయి.

problems with merging of schools
బడికి వెళ్లాలంటే.. కష్టమన్నా పట్టించుకోవడం లేదు

Schools: పాఠశాలకు వెళ్లి రావడం కష్టంగా ఉందని మూడో తరగతిలో 31%, అయిదో తరగతిలో 28%, ఎనిమిదో తరగతిలో 30% విద్యార్థులు జాతీయ సాధన సర్వే-2017లో వెల్లడించారు. ఇప్పుడు పాఠశాలల విలీనంతో ఈ సమస్య మరింత పెరుగుతుంది.

రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం ప్రకారం ఆవాసాలకు పాఠశాలలు అందుబాటులో లేవని సమగ్ర శిక్ష అభియాన్‌కు ఏటా కేంద్రం రవాణా ఛార్జీలను చెల్లిస్తోంది. ఒక్కొక్కరికి నెలకు రూ.600 చొప్పున కేంద్రం నిధులిస్తోంది. ఈ ఏడాది 41వేల మందికి రవాణా ఛార్జీల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. విలీనంతో ఈ సమస్య మరింత పెరుగుతుంది.

పాఠశాలల విలీనంతో ప్రాథమిక విద్యావ్యవస్థ విచ్ఛిన్నమవుతోంది. కరికులమ్‌, బోధన, అభ్యసన విధానాల కోసం తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానంలో మార్పును ఇప్పుడు భౌతికంగా అమలుచేస్తున్నారు. అంగన్‌వాడీలు, ఒకటి, రెండు తరగతులు కలిపి ఉండే ఫౌండేషన్‌ పాఠశాలల పర్యవేక్షణలో అనేక ఇబ్బందులు ఏర్పడనున్నాయి. ఒక పాఠశాలలో రెండు శాఖల బడులు కొనసాగనున్నాయి. అంగన్‌వాడీ, ప్రాథమిక బడులను చాలాచోట్ల కలిపేస్తున్నారు. పర్యవేక్షణ మాత్రం ఏ శాఖకు ఆ శాఖే చేయనుంది. ఒకే ప్రాంగణంలో ఉండే వీటికి మధ్యాహ్న భోజనం నుంచి పాఠశాల సమయాల వరకు అన్నీ మారుతాయి.

విద్యా హక్కు చట్టాన్ని మార్చేశారు

విద్యాహక్కు చట్టం ప్రకారం ఆవాసాలకు కిలోమీటరు దూరంలో 1-5 తరగతులకు ప్రాథమిక పాఠశాల ఉండాలి. దీన్ని మార్చేశారు. 3-7/8 తరగతులు ఉండే ప్రీహైస్కూలు, 3-10 తరగతులు ఉండే హైస్కూలు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చనే నిబంధన తీసుకొచ్చారు. అంటే భవిష్యత్తులో 3,4,5 తరగతులను మూడు కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేయొచ్చు. ఇప్పుడు కిలోమీటరు దూరమని చెబుతున్నా ఈ చట్ట సవరణ ప్రకారం మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలిపేయొచ్చు. విద్యాహక్కు చట్టానికి సవరణ చేసినందున పాఠశాల దూరం పెరిగినా విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లించక్కర్లేదు.

* గ్రామంలో ఉండే అంగన్‌వాడీ కేంద్రాలు కిలోమీటరు దూరం వరకు ఉండొచ్చనే నిబంధన తీసుకొచ్చారు. శాటిలైట్‌ పాఠశాలలుగా మారే వీటిని విద్యార్థుల ఆవాసాలకు కిలోమీటరు దూరం తరలించొచ్చు.

అడ్డంకులను పట్టించుకోవడం లేదు

పాఠశాలలను విలీనం చేస్తున్న పాఠశాల విద్యాశాఖ దారిలో పిల్లలకు ఎదురయ్యే ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. చెరువులు, ప్రధాన, జాతీయ రహదారులు దాటి వెళ్లాల్సి వస్తున్నా విలీనం చేసేస్తున్నారు. దీన్ని తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నా తరలింపు కొనసాగిస్తున్నారు. పిల్లల భద్రతపై తల్లిదండ్రుల ఆవేదన ఎవ్వరికీ పట్టడంలేదు.

* కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం చెన్నంశెట్టిపల్లె ప్రాథమిక పాఠశాలను సోమయాజులపల్లె బడిలో విలీనం చేశారు. విద్యార్థులు 1.5 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై కాలినడకన వెళ్లాలి. ఈ రహదారిపై పిల్లల్ని పంపేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

* నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపూరుపాడు 6,7,8 తరగతుల విద్యార్థులు తరుణవాయి ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే బెజవాడ పాపిరెడ్డి కాల్వ వంతెన దాటాలి.

* అనంతపురం జిల్లా రాయదుర్గం బాలగంగాధరతిలక్‌ పాఠశాలలో 3-10 తరగతి వరకు ఒక్కో గదిలో 85-90 మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. ‘నాడు-నేడు’ కింద ఏర్పాటుచేసిన డ్యూయల్‌ డెస్క్‌లను బయటపెట్టి, నేలపై కూర్చోబెడుతున్నారు.

* చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం బెల్లంమడుగులో పాఠశాల విలీనంతో చెరువులు, కుంటల సమీపం నుంచి వెళ్లాలి.

* పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయ రహదారి దాటి వెళ్లాలి.

ఇలా.. 10-11 ఏళ్లలోపు పిల్లలు జాతీయ, ప్రధాన రహదారులు, వంతెనలు దాటి వెళ్లిరావడం ఎంత కష్టమనే దాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. విలీనంపైనే దృష్టిపెడుతున్నారే తప్ప విద్యార్థుల భద్రతను పట్టించుకోవడం లేదు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.