ETV Bharat / city

అవసరాన్ని... అవకాశంగా మార్చుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు - భారీగా ఛార్జీలు

రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ చర్చల్లో నెలకొన్న ప్రతిష్టంభన... ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు ‘పండుగ’గా మారింది. ప్రస్తుతం ప్రైవేటు బస్సులు మాత్రమే ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ సమయంలో దసరా కూడా తోడవడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఛార్జీలు భారీగా పెంచేస్తున్నారు.

private-busses-charges-heavy-in-festival-season
ప్రైవేటు బస్సుల ఛార్జీలు మోత
author img

By

Published : Oct 23, 2020, 10:28 AM IST

తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన సుమారు 1,500 ఆర్టీసీ బస్సులు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తాయి. కరోనా నేపథ్యంలో అవి నడవకపోవటంతో ప్రైవేటు బస్సుల్లో ఇష్టారాజ్యంగా ఛార్జీలను వసూలు చేస్తున్నారు. దసరాకు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రాకపోకలు భారీగా ఉంటాయి. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులకు ప్రైవేటు బస్సులే దిక్కయ్యాయి. లాక్‌డౌన్‌ సమయంలో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల్ని నిలిపివేశారు.

భారీగా వడ్డన

హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం మార్గాల్లో ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ప్రైవేటు బస్సులు మాత్రమే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు మార్గాల్లో గతంతో పోలిస్తే... రైళ్లు కూడా నామమాత్రంగానే నడుస్తున్నాయి. ఇటీవల వరకు ప్రయాణికుల సంఖ్య కాస్తంత తక్కువగానే ఉన్నప్పటికీ పండుగ సమీపిస్తున్న కొద్దీ ఆ సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు ఛార్జీలు భారీగా పెంచేస్తున్నారు. వీటిపై ఎలాంటి నియంత్రణ లేకపోవటంతో వారిది ఇష్టారాజ్యమైంది.

హైదరాబాద్‌- విజయవాడ రూ. 1,600

* హైదరాబాద్‌-విజయవాడ-హైదరాబాద్‌ మధ్య ఏసీ, ఏసీ స్లీపర్‌ బస్సుల్లో టికెట్‌ రూ 1,200 నుంచి రూ. 1,600 వరకు వసూలు చేస్తున్నారు.

* నాన్‌ ఏసీ బస్సు టికెట్లు రూ. 800 నుంచి 1,000 వరకు ఉన్నాయి.

* హైదరాబాద్‌-బెంగళూరు-హైదరాబాద్‌ మధ్య రూ. 1,750 నుంచి రూ. 2,150

ఇదీ చూడండి:

రెండ్రోజుల్లో తెలంగాణ-ఏపీల మధ్య ఆర్టీసీ సర్వీసులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.