ETV Bharat / city

నేడు హైదరాబాద్​కు ప్రధాని...కోవాగ్జిన్ పురోగతి పరిశీలన - ప్రధాన మంత్రి మోదీ లేటెస్ట్​ వార్తలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్​కు రానున్నారు. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కో వాగ్జిన్ పురోగతిని పరిశీలించటంతో పాటు శాస్త్రవేత్తలతో చర్చించనున్నారు.

modi
modi
author img

By

Published : Nov 28, 2020, 5:53 AM IST

భారత్​ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కో వాగ్జిన్ పురోగతిని పరిశీలించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్​కు రానున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ సంస్థకు వెళ్తారు.

కరోనాపై పోరాడేందుకు భారత్ బయోటెక్ సంస్థ రూపొందిస్తున్న కో వాగ్జిన్ పురోగతిని పరిశీలిస్తారు. వ్యాక్సిన్​ స్థితి, క్లినికల్ ట్రయల్స్ వివరాలు, ఫలితాలను అడిగి తెలుసుకుంటారు. శాస్త్రవేత్తలతో ప్రధాన మంత్రి చర్చిస్తారు. వ్యాక్సిన్ అనుమతులు, తయారీ, పంపిణీ సంబంధిత అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత హకీంపేట విమానాశ్రయం నుంచి తిరుగు పయనమవుతారు.

ఇదీ చదవండి: 'డిసెంబరు 31లోగా నివర్ నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.