ETV Bharat / city

ఇళ్లు నిర్మించే స్తోమత లేదని'... చేతులెత్తేస్తున్న లబ్ధిదారులు - నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం’ లబ్ధిదారులపై ఒత్తిడి

రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల్లో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులపై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. వెంటనే ఇంటి నిర్మాణం ప్రారంభించాలని.. లేకుంటే పట్టాలను వెనక్కి ఇవ్వాలని కొన్ని చోట్ల క్షేత్రస్థాయి సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించక, నిర్మాణ వ్యయం తట్టుకోలేక లబ్దిదారులు సమయం కోరుతున్నారు. అధికారుల ఒత్తిడి తట్టుకోలేని కొందరు లబ్దిదారులు.. పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారు.

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం
నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం
author img

By

Published : Apr 2, 2022, 4:31 AM IST

‘‘మాకు ఇప్పటికే ఆర్థిక సమస్యలున్నాయి. వెంటనే ఇంటిని కట్టుకోలేం. కొంత సమయమివ్వాలి. లేదంటే పట్టాను వెనక్కి తీసుకోండి. నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. ప్రభుత్వం రాయితీ పెంచితేనే పనులు చేయడానికి ఆలోచిస్తాం. మేం ఇప్పటికిప్పుడు నివసిస్తున్న ఇంటిని పడగొట్టి కొత్త నిర్మాణం చేపట్టడం కష్టం. మీ పట్టాలను మీరే తీసుకోండి’’ అని ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం’ లబ్ధిదారులు అధికారులకు తేల్చి చెబుతున్నారు. గృహ నిర్మాణాలను వేగిరం చేసేందుకు లబ్ధిదారులపై క్షేత్ర స్థాయిలో అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.

ఇళ్ల్లు కడతారా? కడితే... ఎప్పుడు ప్రారంభిస్తారు? అసలు మీ ఇబ్బందులేమిటి? నిర్మించకుంటే... అదే విషయాన్ని రాతపూర్వకంగా రాసివ్వండి... అని అడుగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పట్లో సొంతంగా నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేదని లబ్ధిదారులు చెబితే... ‘మీరు కట్టుకోకపోతే రాయితీని వేరే వారికి మంజూరు చేస్తాం. మళ్లీ మీరు నిర్మించుకునేటప్పుడు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది’ అని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తుండగా... నిరుపేదలు వందల సంఖ్యలో పట్టాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు.'

అవగాహన పేరిట అంతులేని ఒత్తిడి

ఇళ్ల నిర్మాణాలపై అవగాహన పేరిట గ్రామాల్లో తహసీల్దారు, ఎంపీడీవో, హౌసింగ్‌ ఏఈ, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఇలా వరుసబెట్టి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్తూ ఒత్తిడి చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేక, ఒత్తిడిని భరించలేక కొందరు లబ్ధిదారులు పట్టాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు.
కడప జిల్లా ముద్దనూరు మండలానికి 1,600 ఇళ్లు మంజూరైతే అందులో 500 మంది ఇప్పట్లో నిర్మించుకోలేమని అధికారులకు తెలిపారు. అధికారుల ఒత్తిడితో 200 మంది తమ పట్టాలను వెనక్కిచ్చేశారు.

  • చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోనూ 400 మంది ఇప్పట్లో కట్టుకోలేమని చెప్పారు.
  • తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం, అల్లవరం, కర్నూలు జిల్లా డోన్‌, నెల్లూరు జిల్లా కావలిలో వెంటనే పనులు ప్రారంభించకుంటే పట్టా రద్దు చేస్తామని లబ్ధిదారులను వాలంటీర్లు హెచ్చరించారు.
  • ఇళ్ల పనులను వెంటనే ప్రారంభించకుంటే పట్టాలను వెనక్కి తీసుకునే అవకాశముందని శ్రీకాకుళం జిల్లాలో అధికారులు చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం, నక్కపల్లిలోనూ మౌఖిక ఆదేశాలిచ్చారు.
  • పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో 4వేల మందికి నోటీసులిచ్చారు.

ఇదీ అసలు కారణం..

జగనన్న కాలనీల్లో మొదటి విడత కింద చేపడుతున్న 15.75 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేసింది. ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చే రూ.1.80 లక్షల రాయితీ కేంద్రం వాటానే. పట్టణ ప్రాంతాల్లోనే రూ.30వేలను రాష్ట్రం భరిస్తోంది. కేంద్రం ఇళ్లను మంజూరు చేసి ఏడాది దాటింది. నిర్మాణాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రాష్ట్రంపై ఒత్తిడి తెస్తోంది. రాష్ట్రానికి రెండో విడత ఇళ్ల మంజూరుపైనా ఈ ప్రభావం పడనుంది. దీంతో ఉన్నతాధికారులు జిల్లాలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.

ఇళ్లు కట్టిస్తారా?... ఇంటికెళతారా?

జిల్లాల్లో కలెక్టరు, జాయింట్‌ కలెక్టరు, నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులంతా... క్షేత్ర స్థాయి అధికారులతో విడతల వారీగా ఇళ్ల నిర్మాణ పురోగతిపై వారానికి ఐదారుసార్లు సమీక్షిస్తున్నారు. లక్ష్యం చేరుకోని మండల స్థాయి అధికారులపై మండిపడుతున్నారు. వారం రోజుల క్రితం కడప జిల్లా యర్రగుంట్ల నగర పంచాయతీలో ఆర్డీవో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారుల్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇళ్లు కట్టిస్తారా? ఇంటికెళతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు నిర్మించుకోలేమని చెప్పిన లబ్ధిదారుల నుంచి రాతపూర్వకంగా రాయించుకుని పట్టాలు వాపస్‌ తీసుకోవాలని ఆదేశించారు.

కృష్ణా జిల్లాలో ఓ ఉన్నతాధికారి మరో అడుగు ముందుకేసి ఇళ్లు కట్టుకోకపోతే పట్టాలు వెనక్కి తీసుకోవడంతోపాటు స్థలం మంజూరుకు ఎంత ఖర్చు అయిందో ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని లబ్ధిదారులను హెచ్చరించారు. అయితే తామెలాంటి ఆదేశాలను ఇవ్వలేదని రాష్ట్ర స్థాయి అధికారులు చెబుతున్నారు. నిర్మాణాలు వేగిరం చేసేందుకే నోటీసులు ఇస్తున్నామని, ఏ ఒక్కరి రాయితీ, పట్టా రద్దు చేయబోమని జిల్లా అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: పండుగ వేళ ఉద్యోగులకు అందని జీతాలు.. పని చేయని కొత్త సాఫ్ట్​వేర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.