ETV Bharat / city

విద్యుత్ సరఫరాపైనా బొగ్గు సంక్షోభ ప్రభావం.. ఈపీడీసీఎల్‌ పరిధిలో అనధికార కోతలు - ఏపీ విద్యుత్ కోతలు

దేశంలో నెలకొన్న బొగ్గు సంక్షోభం కారణంగా రాష్ట్రంలోనూ విద్యుత్ కోతలు తప్పేలా లేవు. ఇప్పటికే ఈపీడీసీఎల్ పరిధిలో అనధికార కోతలు కనిపిస్తుండగా...క్రమంగా ఇవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం... డిమాండ్‌ను తట్టుకునేలా అతి తక్కువ అంతరాయాలతోనే డిస్కంలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు చెబుతోంది.

power cuts in epscl
power cuts in epscl
author img

By

Published : Oct 14, 2021, 10:15 AM IST

విద్యుత్ సరఫరాపైనా బొగ్గు సంక్షోభ ప్రభావం.. ఈపీడీసీఎల్‌ పరిధిలో అనధికార కోతలు

బొగ్గు కొరత వల్ల.. రాష్ట్రంలో అనధికారికంగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఈపీడీసీఎల్ పరిధిలోని 5 జిల్లాల్లో పరిశ్రమ, సాగు, వాణిజ్య అవసరాలకు తోడు... గృహ వినియోగమూ అధికంగా ఉంది. ఇప్పటికే లోటు విద్యుత్‌తో సతమతమవుతున్న తరుణంలో పెరిగిన డిమాండ్‌ సరఫరా మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి..... పరిశ్రమలకు వివిధ ఆంక్షలు విధించడం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. విద్యుత్‌ లోడ్‌ తగ్గించేలా అంతర్గత సర్దుబాట్లు చేసుకోవాలని పరిశ్రమలకు సూచనలు చేస్తున్నారు.

గృహ విద్యుత్ సరఫరాలో కోతలు చివరి ప్రాధాన్యంగా పరిగణిస్తామని .. ఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పెద్దఎత్తున కోతలు విధించే పరిస్థితులు లేవంటున్నారు. అనధికారికంగా ఇప్పుడు పెడుతున్న కోతలు... భవిష్యత్‌లో గంట, రెండు గంటల దాకా వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు. గతంలో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 దాకా ఉండే పీక్ అవర్స్.... ప్రస్తుతం రాత్రి పన్నెండున్నర దాకా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

గత కొన్నాళ్లుగా ఈపీడీసీఎన్ పరిధిలోని ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో.. సంస్థకు వచ్చే విద్యుత్ కోటాను మించి వాడుతున్నట్టు తేలింది. 62 నుంచి 64 మిలియన్ యూనిట్ల కోటా... డిస్కంకు ఉండగా..సుమారు 70నుంచి 71మిలియన్ యూనిట్లు వినియోగిస్తున్నారు. తీరప్రాంత భూ భాగంపై వేడిగాలుల ప్రభావం సహా ఉక్కపోత పెరగటంతో ఏసీల వినియోగం భారీగా పెరిగినట్టు అంచనా వేస్తున్నారు. మరోవైపు...... రాష్ట్రంలో బొగ్గు కొరత ఉన్నప్పటికీ విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా డిస్కమ్‌లు పనిచేస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అతి తక్కువ అంతరాయాలతోనే విద్యుత్‌ను సరఫరా చేయగలుగుతున్నట్టు ఏపీ ట్రాన్స్‌కో వెల్లడించింది. విద్యుత్ డిమాండ్ రోజుకు కనీసంగా 15 మిలియన్ యూనిట్లు పెరగటం వల్లే ఇబ్బందులు తలెత్తినట్టు స్పష్టం చేసింది.

ఏపీ జెన్‌కో వ్యవస్థాపిత సామర్థ్యం 5010 మెగావాట్లు అయినప్పటికీ ... బొగ్గు కొరత కారణంగా 2500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోందని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుందని...... అయితే సెప్టెంబర్‌లో 24 వేల టన్నులు మాత్రమే సరఫరా అయ్యిందని పేర్కొంది. బొగ్గు కొరత కారణంగా ఏపీలో విద్యుత్ సంక్షోభం తలెత్తిందని ట్రాన్స్‌కో పేర్కొంది. పీక్ అవర్స్‌లో ఒక్కో యూనిట్ కు 15-20 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చిందని తెలిపింది. సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఉన్నా బేస్ లోడుకు సరిపడా ఉత్పత్తి కావట్లేదని స్పష్టం చేసింది. బొగ్గు కొరత వల్ల వీటీపీఎస్​తో పాటు రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్‌లోని యూనిట్లను నిలిపివేయాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్‌తో పాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్టీపీఎస్ సామర్థ్యం కంటే తక్కువ విద్యుత్‌నే ఉత్పత్తి చేస్తున్నాయని ట్రాన్స్‌కో పేర్కొంది.

ఇదీ చదవండి:Power Crisis: విద్యుత్‌ కొరతపై రాష్ట్రానికి ముందే కేంద్రం హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.